Bihar’s Vaccine Data : మోదీ,షా,సోనియా,ప్రియాంక చోప్రా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంది బీహార్ లోనే!

కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునేందుకు ప్రధాని మోదీ, అమిత్ షా, సోనియాగాంధీ,బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, ప్రియాంక చోప్రా ప్రత్యేకంగా బీహార్ కు క్యూ కట్టిన విషయం తెలుసా?కరోనా నిర్ధరణ

Bihar’s Vaccine Data : కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునేందుకు ప్రధాని మోదీ, అమిత్ షా, సోనియాగాంధీ,బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, ప్రియాంక చోప్రా ప్రత్యేకంగా బీహార్ కు క్యూ కట్టిన విషయం తెలుసా?కరోనా నిర్ధరణ పరీక్షలు సైతం వీరందరూ బీహార్ లోనే చేయించుకున్నారంట. అదేంటి, వీరందరూ ప్రత్యేకించి బీహార్‌కే వచ్చి ఒకే చోట వ్యాక్సిన్ వేయించుకోవడమేంటి? అని ఆశ్చర్యపోకండి. కంప్యూటర్ ఆపరేటర్ల పుణ్యమా అని బీహార్​లోని ఓ ప్రాంతంలో నివసిస్తున్న వీరందరూ బీహార్ లోనే కోవిడ్ టెస్ట్ లు చేయించుకోవడంతో పాటు,కోవిడ్ వ్యాక్సిన్ అక్కడే తీసుకున్నారు. బీహార్ ఆరోగ్య శాఖ చేపట్టిన విచారణలో ఈ విషయం బయటపడింది.

బీహార్‌లోని అర్వాల్ జిల్లా కార్పీ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో టీకాలు తీసుకున్నవారి వివరాలను ఇటీవలే ‘వ్యాక్సినేషన్‌ పోర్టల్‌’లో ఉంచారు. ఆ జాబితాను పరిశీలించగా..మోదీ, అమిత్ షా, అక్షయ్‌ కుమార్‌, ప్రియాంక చోప్రా వంటి సెలబ్రిటీల పేర్లు ఉన్నాయి. అంతేకాకుండా వీరందరూ ఒక్కసారే గాక పలుమార్లు ఇదే కేంద్రంలో వ్యాక్సిన్ తీసుకున్నట్లు చూపడం గమనార్హం. దీనితో అధికారులు షాకయ్యారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన జిల్లా యంత్రాంగం విచారణకు ఆదేశించింది. దీనిలో భాగంగా ఇద్దరు డేటా ఆపరేటర్లను విధుల నుంచి తొలగించింది. వారిపై ఎఫ్​ఐఆర్ సైతం నమోదు చేసినట్లు అర్వాల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ జె. ప్రియదర్శిని తెలిపారు. జిల్లాలోని ఇతర హెల్త్‌ సెంటర్లలోని రికార్డులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఆమె తెలిపారు.

బీహార్ లో తాజాగా వెలుగుచూసిన కోవిడ్ వ్యాక్సిన్ డేటా ఫ్రాడ్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. 8 కోట్ల మంది ప్రజలకు వ్యాక్సిన్ అందించామని బీహార్‌ ప్రభుత్వం వారం రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్రంలో వ్యాక్సిన్ తీసుకున్న 8 కోట్ల మందిలో ప్రధాని మోదీతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు కూడా ఉండటం ఇప్పుడు రాజకీయ విమర్శలకు కారణమైంది. బీహార్‌లోని ఆరోగ్య శాఖ అవినీతిలో కూరుకుపోయిందని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ విమర్శించారు. వివిధ సూచీల్లో దేశంలోనే రాష్ట్రాన్ని అట్టడుగున ఉంచేందుకు పాలకవర్గం తీవ్రంగా పోటీపడుతోందని ఆర్జేడీ-బీజేపీ సర్కార్ పై తేజస్వీ సెటైర్లు వేశారు.

ALSO READ Pushpa: పుష్పరాజ్ కోసం ఈ ఇద్దరూ.. ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్

ట్రెండింగ్ వార్తలు