WhatsApp Voice Note : వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై లాంగ్ వాయిస్ నోట్స్‌ను స్టేటస్ అప్‌డేట్‌లుగా షేర్ చేయొచ్చు!

WhatsApp Voice Note : వాట్సాప్ స్టేటస్ అప్‌డేట్ ఫీచర్‌ను అప్‌గ్రేడ్ చేస్తోంది. యూజర్లను లాంగ్ వాయిస్ నోట్‌లను పోస్ట్ చేసేందుకు అనుమతిస్తుంది. ఒక నిమిషం నిడివి గల వాయిస్ నోట్‌లను స్టేటస్ అప్‌డేట్‌లుగా షేర్ చేయవచ్చు.

WhatsApp Voice Note : వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై వాట్సాప్ లాంగ్ వాయిస్ నోట్స్‌ను స్టేటస్ అప్‌డేట్స్ మాదిరిగా పంపుకోవచ్చు. గత కొన్ని రోజులుగా, వాట్సాప్ స్టేటస్ అప్‌డేట్‌లలో మార్పులు చేయబోతున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఇంటర్‌ఫేస్‌ను పూర్తిగా మార్చడం నుంచి కాంటాక్టులను ప్రైవేట్‌గా పేర్కొనడానికి యూజర్లను అనుమతించడం వరకు, ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ అనేక ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు, లేటెస్ట్ బీటాఇన్ఫో నివేదిక ప్రకారం.. వాట్సాప్ ఒక కొత్త ఫీచర్‌ను విడుదల చేస్తోంది. ఈ ఫీచర్ సాయంతో వినియోగదారులు ఎక్కువ వాయిస్ నోట్‌లను స్టేటస్ అప్‌డేట్‌గా పోస్ట్ చేయొచ్చు.

వాట్సాప్ కొత్త ఫీచర్‌ ఇదిగో :
వాట్సాప్ iOS, ఆండ్రాయిడ్ యూజర్ల కోసం స్టేటస్ ఫీచర్ సామర్థ్యాలను విస్తరిస్తోందని నివేదిక పేర్కొంది. మెటా యాజమాన్య యాప్ ఒక నిమిషం నిడివిలో వాయిస్ నోట్‌లను షేర్ చేయగల సామర్థ్యంతో స్టేటస్ ఫీచర్‌ను మెరుగుపరుస్తోంది. వాట్సాప్ కొత్త వెర్షన్‌లకు అప్‌డేట్ చేసే యూజర్‌లు ఇప్పుడు తమ స్టేటస్ అప్‌డేట్‌ల ద్వారా లాంగ్ ఆడియో మెసేజ్‌లను రికార్డ్ చేయవచ్చు. అలాగే షేర్ చేయవచ్చు. వాట్సాప్ స్టేటస్‌లో లాంగ్ వీడియోలను పోస్ట్ చేయగల సామర్థ్యాన్ని అందిస్తోంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఫీచర్.. వినియోగదారులు లాంగ్ వీడియో క్లిప్‌లను షేర్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఈవెంట్‌లు, యాడ్స్ లేదా క్యాప్చర్ చేయడానికి కేవలం 30 సెకన్ల కన్నా ఎక్కువ సమయం పట్టే ఏవైనా మూవెంట్స్ షేర్ చేయడానికి ఈ అప్‌డేట్ ప్రత్యేకంగా ఉపయోగిస్తుంది.

ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే? :
డబ్ల్యూఏ బీటాఇన్ఫో షేర్ చేసిన స్క్రీన్‌షాట్ ప్రకారం.. వినియోగదారులు చాట్‌లలో వాయిస్ నోట్‌ను పంపుతున్నట్లుగానే మైక్ బటన్‌ను నొక్కి పట్టుకోవడం ద్వారా వాయిస్ నోట్‌లను రికార్డ్ చేయొచ్చు. అదేవిధంగా, వాయిస్ నోట్‌ని క్యాన్సిల్ చేయడానికి మీరు స్లయిడ్ కూడా చేయవచ్చు. ఇప్పటికే చెప్పినట్లుగా, కొత్త ఫీచర్ కొంతమంది యూజర్లకు లేటెస్ట్ వాట్సాప్ వెర్షన్‌తో అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్‌లో అప్‌డేట్‌ను కనుగొనవచ్చు. ఐఓఎస్ యూజర్లు యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రానున్న రోజుల్లో ఈ ఫీచర్ మరింత మంది యూజర్లకు అందుబాటులోకి రానుంది.

ఇతర వాట్సాప్ స్టేటస్ ఫీచర్లు :
ఇక వాయిస్ నోట్స్ కాకుండా ఇతర ఫీచర్లపై కూడా వాట్సాప్ పనిచేస్తోంది. మీ స్టేటస్ అప్‌డేట్‌లను ఎవరు చూడవచ్చుననే దానిపై మరింత నియంత్రణను అందించడానికి వాట్సాప్ సిద్ధంగా ఉందని ఇటీవల నివేదించింది. ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ కొత్త టూల్స్‌తో ప్రయోగాలు చేస్తోంది. వినియోగదారులు తమ షేరింగ్ కంటెంట్‌ను కచ్చితంగా ఎవరు వీక్షించవచ్చో సెట్ చేసుకోవచ్చు.

మరో మాటలో చెప్పాలంటే.. వాట్సాప్ యూజర్లు తమ అప్‌డేట్‌లను ఎవరు చూడవచ్చనే దానిపై మరింత నియంత్రణను పొందవచ్చు. వినియోగదారులు తమ స్టేటస్ అప్‌డేట్‌లుగా లాంగ్ వీడియోలను కూడా షేర్ చేయవచ్చు. ఒక నిమిషం నిడివి గల వీడియోలను షేర్ చేయొచ్చు. ఇంతకు ముందు, స్టేటస్ అప్‌డేట్‌ల ద్వారా షేర్ చేయగల వీడియోలపై 30 సెకన్ల పరిమితి ఉండేది.

Read Also :  WhatsApp AI Profile Photos : వాట్సాప్‌లో త్వరలో ఏఐ ఆధారిత ప్రొఫైల్ ఫొటోలను క్రియేట్ చేయొచ్చు!

ట్రెండింగ్ వార్తలు