Karthik Kumar : గే అన్నందుకు మాజీ భార్యపై.. కోటి రూపాయల పరువు నష్టం కేసు వేసిన కమెడియన్..

నటుడు, స్టాండప్ కమెడియన్ కార్తీక్ కుమార్ త‌న మాజీ భార్య సుచిత్ర‌కు లీగ‌ల్ నోటీసులు పంపాడు.

Karthik Kumar – Suchitra : నటుడు, స్టాండప్ కమెడియన్ కార్తీక్ కుమార్ త‌న మాజీ భార్య సుచిత్ర‌కు లీగ‌ల్ నోటీసులు పంపాడు. ఓ స్థానిక యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో సింగ‌ర్, ఆర్కే అయిన సుచిత్ర త‌న మాజీ భ‌ర్త అయిన కార్తీక్ స్వ‌లింగ సంపర్కుడ‌ని పేర్కొంది. దీంతో ఆమెపై కార్తీక్ ప‌రువు న‌ష్టం కేసు వేశాడు. త‌న ప్ర‌తిష్ఠ‌కు న‌ష్టం క‌లిగించినందుకు రూ.కోటీ ప‌రిహారం చెల్లించాల‌ని కోరుతూ త‌న న్యాయ‌వాది ద్వారా ఆమెకు మే 16న నోటీసులు పంపాడు.

మోహిని చిత్రీకరణ సమయంలో నటుడు ధనుష్‌తో కార్తీక్‌కు ఉన్న సంబంధంపై తనకు అనుమానాలు ఉన్నాయని సుచిత్ర ఇంటర్వ్యూలో ఆరోపించారు. దీంతో కార్తీక్ ప‌రువు న‌ష్టం కేసు వేశాడు. ఈ కేసును మే 24న మద్రాస్ హైకోర్టు విచారించింది. కార్తీక్ గురించి ఇకపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా సుచిత్రపై న్యాయమూర్తి మధ్యంతర నిషేధం విధించారు. త‌దుప‌రి విచారణన‌ను జూలై 1కి వాయిదా వేశారు.

Rajamouli : ఆ అవార్డు తీసుకోనంటే.. రాజమౌళిని తిట్టిన సిరివెన్నెల సీతారామశాస్త్రి..

సుచిత్ర ఆరోపణలకు ప్రతిస్పందనగా కుమార్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశాడు, అందులో “తాను స్వలింగ సంపర్కుడినైతే, స్వలింగ సంపర్కుడిగా తానేమీ సిగ్గుపడను” అని పేర్కొన్నాడు.

ట్రెండింగ్ వార్తలు