కోట్లాది రూపాయల కుంభకోణం జరిగిందని అంటున్నారు: సామ రామ్మోహన్ రెడ్డి

సివిల్ సప్లయ్‌లో అవినీతి జరిగిందని బీఆర్ఎస్, బీజేపీ ఆరోపణలు చేస్తున్నాయని తెలిపారు.

బీజేపీ, బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై టీపీసీసీ మీడియా కోఆర్డినేటర్ సామ రామ్మోహన్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

సివిల్ సప్లయ్‌లో అవినీతి జరిగిందని బీఆర్ఎస్, బీజేపీ ఆరోపణలు చేస్తున్నాయని తెలిపారు. 11 వందల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని బీజేపీ అంటుంటే, 600 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ అంటోందని చెప్పారు. తెలంగాణలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎన్నడూ సన్న బియ్యం ఇవ్వలేదని తెలిపారు.

మధ్యాహ్నం భోజనంతో పాటు అన్ని కాలేజీల్లో సన్న బియ్యంతో భోజనం పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. తమ సర్కారు చిత్త శుద్ధితో పని చేస్తోందని తెలిపారు. పౌరసరఫరాల శాఖలో కుంభకోణాలు చేసింది బీఆర్ఎస్ నాయకులేనన్నారు. బహిరంగ చర్చకు కరేటీఆర్ సిద్ధమా అని ఆయన సవాలు విసిరారు. కిషన్ రెడ్డి కంటే గొప్పోడు కావాలని మహేశ్వరెడ్డి చూస్తున్నారని అన్నారు.

Also Read: తెలంగాణ డీజీపీ కార్యాలయానికి వెళ్లి హత్యపై ఫిర్యాదు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

ట్రెండింగ్ వార్తలు