Video: నడిరోడ్డుపై బీఎమ్‌డబ్ల్యూ కారు నడిపిన టీనేజర్.. బానెట్‌పై పడుకుని ప్రయాణించిన యువకుడు

కారు నడిపిన టీజేజర్ తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ మైనర్ తండ్రి ప్రభుత్వ అధికారిగా

ఓ యువకుడు (21) నడిరోడ్డుపై బీఎమ్‌డబ్ల్యూ కారు బానెట్‌పై పడుకుని ప్రయాణించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనిపై స్పందిచిన పోలీసులు ముంబైలో అతడిని అరెస్టు చేశారు.

ముంబైలోని శివాజీ చౌక్ ప్రాంతం వద్ద ఓ టీజేనర్ బీఎమ్‌డబ్ల్యూ కారు నడపసాగాడు. మరో యువకుడు వచ్చి బానెట్‌పై పడుకున్నాడు. అతడి పేరును సుభమ్ మిటాలియాగా పోలీసులు గుర్తించారు. ఈ సమయంలో స్థానికులు తమ స్మార్ట్‌ఫోన్లలో ఈ దృశ్యాలను చిత్రీకరించారు.

కారు నడిపిన టీజేజర్ తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ మైనర్ తండ్రి ప్రభుత్వ అధికారిగా పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు. మైనర్ తండ్రి పేరు మీద కారు రిజిస్టర్ అయి ఉందని చెప్పారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడానికి కుమారుడిని కారు ఇచ్చినందుకు అతడిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు.

Also Read: మనదేశంలో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ.. యాహూ.. వీడియో ఇదిగో

ట్రెండింగ్ వార్తలు