నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల ఇంఛార్జిల‌ను నియమించిన బీజేపీ.. కిషన్ రెడ్డికి కీలక బాధ్యతలు

BJP : 2024 లోక్ సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. వరుసగా మూడోసారి ఎన్డీయే కూటమిని దేశ ప్రజలు గద్దెనెక్కించారు. దీంతో మూడోసారి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారంచేసి.. బాధ్యతలుసైతం స్వీకరించారు. నూతన మంత్రివర్గం కూడా కొలువుదీరింది. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలుపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా ఎన్నికల కోలాహలం ముగిసిన కొద్దిరోజులకే బీజేపీ కేంద్ర పార్టీ అధిష్టానం రాష్ట్రాల ఎన్నికలపై దృష్టిసారించింది. ఈ ఏడాది చివర్లో నాలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఆయా రాష్ట్రాలకు పార్టీ అధిష్టానం ఇంఛార్జిలను నియమించింది.

Also Read : Train Accident : పశ్చిమ బెంగాల్‌లో రైలు ప్రమాదానికి కారణం అతడేనా..? రైల్వే బోర్డు చైర్మన్ ఏం చెప్పారంటే..

ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాల్లో సత్తాచాటేందుకు బీజేపీ కేంద్ర అధిష్టానం కసరత్తు మొదలు పెట్టింది. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాలకు సోమవారం ఎన్నికల ఇంఛార్జిలను నియమిస్తూ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. మహారాష్ట్రకు ఇద్దరు కేంద్ర మంత్రులను ఇంచార్జిలుగా నియమించింది. పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ను ఇన్ ఛార్జిగా నియమించగా.. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను కో- ఇన్ ఛార్జిగా నియమించింది.

Also Read : తాడేపల్లిలో వైఎస్ జగన్ నివాసం వద్ద ప్రైవేటు సెక్యూరిటీ.. ఎంతమందితో అంటే ..

కేంద్ర మంత్రి దర్మేద్ర ప్రదాన్ కు హర్యానా రాష్ట్ర ఇంచార్జి బాధ్యతలు అప్పగించింది. అతనికి త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేబ్ సహాయం చేయనున్నారు. అదేవిధంగా ఝార్ఖండ్ రాష్ట్రంలో మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు బాధ్యతలు అప్పగించగా.. అతనికి అస్సాం సీఎం హిమంత బిస్వాశర్మను సహాయకారిగా నియమించింది. జమ్మూకశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డికి బీజేపీ అధిష్టానం ఎన్నికల ఇంచార్జిగా నియమించింది.

 

ట్రెండింగ్ వార్తలు