MS Dhoni : పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమ్ఇండియా బిజీ.. మాజీ కెప్టెన్ ధోని ఏం చేస్తున్నాడంటే..?

టీమ్ఇండియా ప్ర‌స్తుతం టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌తో బిజీగా ఉంది.

MS Dhoni – T20 World Cup 2024 : టీమ్ఇండియా ప్ర‌స్తుతం టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌తో బిజీగా ఉంది. వ‌రుస విజ‌యాలు సాధిస్తూ సూప‌ర్ 8కి చేరుకుంది. అయితే.. టీమ్ఇండియా దిగ్గ‌జ ఆట‌గాడు, మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనికి సంబంధించిన ఓ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

టీమ్ఇండియాకు రెండు ప్ర‌పంచ‌క‌ప్‌లు అందించిన ధోని సోష‌ల్ మీడియాకు చాలా దూరంగా ఉంటాడు అన్న సంగ‌తిని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. చాలా అరుదుగా మాత్ర‌మే అత‌డు పోస్టులు పెడుతుంటాడు. కాగా.. ఫాద‌ర్స్ డే సంద‌ర్భంగా మాజీ క్రికెట‌ర్ ధోని కూతురు జివా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది.

Sehwag : టీ20ల‌కు పాక్ కెప్టెన్ బాబ‌ర్ ఆజాం ప‌నికిరాడు.. సెహ్వాగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

ఇక సింపుల్ జీవితాన్ని ఇష్ట‌ప‌డే ధోని త‌న భార్య సాక్షి, కూతురు జీవితో క‌లిసి రాంచీలోని త‌న ఫామ్‌హౌస్‌లో పెంపుడు శున‌కాల‌తో క‌లిసి ఆడుకుంటూ క‌నిపించాడు. ఈ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది.

అంత‌ర్జాతీయ క్రికెట్‌కు ధోని ఎప్పుడో రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించాడు. ప్ర‌స్తుతం ఐపీఎల్ మాత్ర‌మే ఆడుతున్నాడు. చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు. ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో చెన్నై ప్లే ఆఫ్స్‌కు చేర‌కుండానే నిష్ర్క‌మించింది. ఇక ధోనికి ఇదే చివ‌రి సీజ‌న్ అని ప్ర‌చారం జ‌రిగింది. అయితే.. ఈ వార్త‌ల‌పై ధోని ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌లేదు.

Team India : క్రికెట్‌ను ప‌క్క‌న పెట్టిన టీమ్ఇండియా ప్లేయ‌ర్లు.. కరీబియన్ దీవుల్లో బీచ్ వాలీబాల్..

ట్రెండింగ్ వార్తలు