Team India : క్రికెట్‌ను ప‌క్క‌న పెట్టిన టీమ్ఇండియా ప్లేయ‌ర్లు.. కరీబియన్ దీవుల్లో బీచ్ వాలీబాల్..

సూప‌ర్ 8 మ్యాచ్‌ల కోసం భారత జ‌ట్టు వెస్టిండీస్‌లో అడుగుపెట్టింది.

Team India : క్రికెట్‌ను ప‌క్క‌న పెట్టిన టీమ్ఇండియా ప్లేయ‌ర్లు.. కరీబియన్ దీవుల్లో బీచ్ వాలీబాల్..

Indian players Beach Volley Ball in Barbados

Team India – T20 World Cup 2024 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో వ‌రుస విజ‌యాల‌తో సూప‌ర్ 8కి దూసుకువెళ్లింది టీమ్ఇండియా. లీగ్‌ ద‌శ‌లో నాలుగు మ్యాచులు జ‌రుగ‌గా మూడింటిలో విజ‌యం సాధించింది. ఫ్లోరిడా వేదిక‌గా కెన‌డాతో జ‌ర‌గాల్సిన ఆఖ‌రి లీగ్ మ్యాచ్ ర‌ద్దైంది. దీంతో 7 పాయింట్ల‌తో ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానంలో కొన‌సాగుతూ సూప‌ర్ 8లోకి అడుగుపెట్టింది.

లీగ్ మ్యాచులు మొత్తం అమెరికాలో జ‌రుగ‌గా సూప‌ర్ 8 మ్యాచ్‌ల కోసం భారత జ‌ట్టు వెస్టిండీస్‌లో అడుగుపెట్టింది. సూప‌ర్ 8లో భార‌త జ‌ట్టు త‌న తొలి మ్యాచ్‌ను జూన్ 20న బార్బ‌డోస్ వేదిక‌గా అఫ్గానిస్తాన్‌తో ఆడ‌నుంది. ఈ మ్యాచ్ కు మ‌రో మూడు రోజులు స‌మ‌యం ఉండ‌డంతో భార‌త ఆట‌గాళ్లు స‌ర‌దాగా గ‌డుపుతున్నారు.

Stunning Catch : మీక‌ళ్ల‌ని మీరే న‌మ్మ‌లేరు.. క్రికెట్ చరిత్ర‌లోనే అత్యుత్త‌మ క్యాచ్‌..!

బార్బ‌డోస్ బీచ్‌కు వెళ్లిన భార‌త ఆట‌గాళ్లు అక్క‌డ స‌ర‌దాగా వాలీబాల్ ఆడారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్‌గా మారింది.

కాగా.. టీమ్ఇండియా ప్ర‌పంచ‌క‌ప్‌ను ముద్దాడి చాలా ఏళ్లు అయ్యింది. 2007 ఆరంభ ఎడిష‌న్‌లో టీ20 ప్ర‌పంచ‌క‌ప్ విజేత‌గా భార‌త్ నిలిచింది. ఆ త‌రువాత ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రోసారి పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌ను ముద్దాడ‌లేదు. క‌నీసం ఈ సారి అయినా టీమ్ఇండియా పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌ను ముద్దాడాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.

Sandeep Lamichhane : అత్యాచార ఆరోప‌ణ‌లు.. క‌ట్ చేస్తే.. టీ20 ఫార్మాట్‌లోనే అరుదైన ఘ‌న‌త‌..