ఉక్కుపాదం మోపుతాం.. 3 నెలల్లో మార్పులు తీసుకొస్తాం: హోం మంత్రి అనిత

Vangalapudi Anitha: ఎవ్వరినైనా వదిలిపెట్టేది లేదని అనిత చెప్పారు. టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగిందని..

పోలీస్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించానని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి అనిత అన్నారు. ఇవాళ విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గంజాయిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. మూడు నెలల్లో మార్పులు తీసుకొస్తామని చెప్పారు.

గంజాయి, డ్రగ్స్ నిర్మూలన కోసం చర్చించామని అనిత తెలిపారు. గత వైసీపీ సర్కారు గంజాయి నిర్మలనపై చర్యలు తీసుకోలేదని చెప్పారు. గంజాయి వల్ల విశాఖలో నేరాల రేట్ పెరిగిందని తెలిపారు. గంజాయి కేసుల్లో 1,230 మంది విశాఖ జైలులో ఉన్నారని చెప్పారు. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు.

ఎవరైనా గుంపులు, గుంపులుగా ఉంటే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు అనిత చెప్పారు. హోం శాఖను ఐదేళ్లుగా నిర్వీర్యం చేశారని తెలిపారు. ఇకపై గంజాయి వ్యాపారం చేద్దామన్న ఆలోచన ఉంటే వారు దాన్ని వెంటనే విరమించుకోవాలని అన్నారు.

వాటిని స్మగ్లింగ్ చేస్తే ఎవ్వరినైనా వదిలిపెట్టేది లేదని అనిత చెప్పారు. టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగిందని, చెక్ పోస్టులను పెంచుతున్నామని అన్నారు. విశాఖలో గంజాయి వాడకం లేకుండా చేస్తామని ఆమె అన్నారు.

Also Read: వైసీపీకి మాజీ మంత్రి శిద్దా రాఘవరావు రాజీనామా.. జగన్‌కు లేఖ

ట్రెండింగ్ వార్తలు