మనదేశంలో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ.. యాహూ.. వీడియో ఇదిగో

Statue Of Liberty: ఇక్కడి స్టాట్యూ ఆఫ్ లిబర్టీని చూడడానికి చాలా మంది వస్తున్నారు.

స్టాట్యూ ఆఫ్ లిబర్టీ పేరు వినగానే మనకు అమెరికా గుర్తుకు వస్తుంది. దాన్ని చూడాలంటే న్యూయార్క్ సిటీ వెళ్లి చూడాల్సిందే. అయితే, ఇప్పుడు మన దేశంలోనూ స్టాట్యూ ఆఫ్ లిబర్టీని చూడొచ్చు. అదీ చాలా ఎత్తుకు ఎక్కితేగానీ దానితో ఫొటోలు తీసుకోలేం.

పంజాబ్‌లోని తర్న్‌తరణ్‌లో దీన్ని ఏర్పాటు చేశారు. ఓ అపార్ట్‌మెంట్ పైకప్పుపై దీన్ని నిర్మించారు. ఇక్కడి స్టాట్యూ ఆఫ్ లిబర్టీని చూడడానికి చాలా మంది వస్తున్నారు. ఈ స్టాట్యూ ఆఫ్ లిబర్టీకి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ విగ్రహాన్ని క్రేన్ సాయంతో అపార్ట్‌మెంట్ పై పెట్టారు. ఇది నెటిజన్లకు విశేషంగా ఆకట్టుకుంటోంది.

అచ్చం అమెరికాలోని స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ మాదిరిగానే ఇది ఉంది. పంజాబ్ లో ఇళ్లపై ఇటువంటివి ఏర్పాటు చేయడం చూస్తుంటాం కానీ, ఏకంగా స్టాట్యూ ఆఫ్ లిబర్టీని చూడడం ఇదే తొలిసారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రపంచంలోని అన్ని ప్రసిద్ధ విగ్రహాలు ఇండియాలో ఉన్నాయని మరికొందరు కామెంట్ చేశారు.

Also Read: ఇప్పటికే 2 వజ్రాలు లభ్యం.. ఇప్పుడు 3 వజ్రాలు దొరికాయి.. ఎగిరి గంతులు..

ట్రెండింగ్ వార్తలు