Pushpa 2 Update: అందరూ అనుకున్నట్టే పుష్ప 2 వాయిదా.. ఇక డిసెంబరు వరకు ఆగాల్సిందే..

పుష్ప 2ను ముందుగా అనుకున్న తేదీకే విడుదల చేయడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ షూటింగ్ ఇంకాస్త మిగిలి ఉండడం..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజా సినిమా ‘పుష్ప 2 ది రూల్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. మొదట ఈ ఏడాది ఆగస్ట్ 15న ఈ సినిమాను రిలీజ్ చేయాలని సినిమా యూనిట్ భావించిన విషయం తెలిసిందే. అయితే, కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడింది. ఈ మూవీ టీమ్ కొత్త డేట్ ను ప్రకటించింది.

‘పుష్ప-2 ది రూల్’ను ఈ ఏడాది డిసెంబరు 6న విడుదల చేస్తున్నట్లు తెలిపింది. పుష్ప 2ను ముందుగా అనుకున్న తేదీకే విడుదల చేయడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ షూటింగ్ ఇంకాస్త మిగిలి ఉండడం, పోస్ట్ ప్రొడక్షన్ పనులూ ఉండడంతో వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.

కాగా, సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. పుష్ప 1 భారీ హిట్ కొట్టడంతో పుష్ప 2పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్‌. సినిమాలో ఫహద్ ఫాసిల్, ధనంజయ, అనసూయ భరద్వాజ్, సునీల్, రావు రమేశ్, తదితరులు కీలక పాత్రల్లో నటించారు. దేవి శ్రీ ప్రసాద్ బాణీలు సమకూర్చారు.

PUSHPA

Raa Raja Teaser : భయపెట్టే ‘రా రాజా’ టీజర్.. అల్లరి నరేష్ చేతుల మీదుగా లాంచ్..

ట్రెండింగ్ వార్తలు