Raa Raja Teaser : భయపెట్టే ‘రా రాజా’ టీజర్.. అల్లరి నరేష్ చేతుల మీదుగా లాంచ్..
హారర్ జానర్ లో తెరకెక్కుతున్న రా రాజా సినిమా టీజర్ ను తాజాగా అల్లరి నరేష్ లాంచ్ చేశారు.

Horror Movie Raa Raja Teaser Launched by Allari Naresh
Raa Raja Teaser : సుగి విజయ్, మౌనిక మగులూరి జంటగా శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్ పై బి.శివప్రసాద్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘రా రాజా’. ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నాడు. హారర్ జానర్ లో తెరకెక్కుతున్న రా రాజా సినిమా టీజర్ ను తాజాగా అల్లరి నరేష్ లాంచ్ చేశారు.
Also Read : Nikhil – Varun Sandesh : ‘హ్యాపీడేస్’ రోజులు గుర్తొచ్చేలా.. వరుణ్ సందేశ్ కోసం నిఖిల్..
ఎలాంటి డైలాగ్స్ లేకుండా భయపెట్టే షాట్స్ తో టీజర్ ని అద్భుతంగా కట్ చేసారు. హారర్ సస్పెన్స్ ఎలిమెంట్స్ తో టెర్రిఫిక్ గా అనిపించింది రా రాజా టీజర్. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా హారర్ కి తగ్గట్టు బాగా కుదిరాయి. మీరు కూడా ఈ హారర్ రా రాజా టీజర్ చూసేయండి..
రా రాజా టీజర్ లాంచ్ అనంతరం హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. డైరెక్టర్ ఈ సినిమా కథ చెబుతున్నంత సేపు చాలా ఆసక్తిగా అనిపించింది. రా రాజా టీజర్ బాగుంది. ఇందులో నటించిన ఇరవై నాలుగు క్యారెక్టర్స్ ఎవరి ఫేస్ లు కూడా కనిపించవని డైరెక్టర్ చెప్తే చాలా ఆసక్తిగా అనిపించింది. A.I జనరేషన్ లో కూడా అసలు మొహాలు కనిపించకుండా సినిమా ఎలా తీశారు అనే రీజన్ తో అయినా ఈ సినిమా త్వరగా చూడాలని ఎదురుచూస్తున్నాను అని తెలిపారు. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.