Nikhil – Varun Sandesh : ‘హ్యాపీడేస్’ రోజులు గుర్తొచ్చేలా.. వరుణ్ సందేశ్ కోసం నిఖిల్..

తాజాగా వరుణ్ సందేశ్ నింద సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా ఈ ఈవెంట్ కి నిఖిల్ గెస్ట్ గా వచ్చాడు.

Nikhil – Varun Sandesh : ‘హ్యాపీడేస్’ రోజులు గుర్తొచ్చేలా.. వరుణ్ సందేశ్ కోసం నిఖిల్..

Varun Sandesh Ninda Movie Pre Release Event Nkhil Siddhartha as Guest

Nikhil – Varun Sandesh : హ్యాపీడేస్, కొత్తబంగారు లోకం, కుర్రాడు.. ఇలా వరుస హిట్స్ కొట్టిన వరుణ్ సందేశ్ ఆ తర్వాత పరాజయాలు, సినిమాలకు కొంచెం గ్యాప్ ఇచ్చాడు. మళ్ళీ ఇప్పుడు రీ ఎంట్రీతో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. వరుణ్ సందేశ్ ఇప్పుడు ‘నింద’ అనే థ్రిల్లర్ సినిమాతో రాబోతున్నాడు వరుణ్ సందేశ్. ది ఫర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజేష్ జగన్నాథం నిర్మాతగా, దర్శకుడిగా ఈ నింద సినిమా తెరకెక్కిస్తున్నారు. జూన్ 21న ఈ సినిమా విడుదల కానుంది.

తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా ఈ ఈవెంట్ కి నిఖిల్ గెస్ట్ గా వచ్చాడు. నిఖిల్, వరుణ్ సందేశ్ ఇద్దరి కెరీర్స్ హ్యాపీడేస్ సినిమాతో మొదలైన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి ఈ ఇద్దరూ మంచి స్నేహితులు. దీంతో వరుణ్ సందేశ్ కోసం నిఖిల్ ఈ ఈవెంట్ కి హాజరయ్యాడు.

Also Read : Mr Bachchan : రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ గ్లింప్స్ రిలీజ్.. యాక్షన్‌తో అదరగొట్టిన మాస్ మహారాజ..

నింద సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిఖిల్ సిద్దార్థ్ మాట్లాడుతూ.. నా కెరీర్‌లో స్వామిరారా, కార్తికేయ ఎలా హిట్ అయ్యాయో నింద సినిమా వరుణ్ కెరీర్‌లో ఓ మైల్ స్టోన్‌లా నిలవాలి. నింద మూవీని అందరూ థియేటర్స్ లో చూడండి. నింద మూవీతో వరుణ్ సందేశ్‌ హిట్ కొడుతున్నాడు. చాలా క్వాలిటీతో ఈ సినిమాను తెరకెక్కించారు. డైరెక్టర్ రాజేష్ గురించి అందరూ మాట్లాడుకుంటారు. జూన్ 21న నింద మూవీని చూసి సక్సెస్ చేయాలి అని అన్నారు.

Varun Sandesh Nindha Movie Pre Release Event Nkhil Siddhartha as Guest

ఇక హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. నిఖిల్ ఎదగడం చూస్తుంటే నాకు గర్వంగా ఉంటుంది. నిఖిల్, నేను కలిసి 2007లో హ్యాపీడేస్ చేశాం. అప్పుడు నా వయసు 17. మళ్లీ ఇన్నేళ్ల తరువాత ఇలా ఒకే స్టేజ్ మీదకు సినిమా కోసం నిలబడ్డాం. నా సగం లైఫ్ సినిమా ఇండస్ట్రీలోనే గడిచింది. నింద నా మనసుకు బాగా దగ్గరైన సినిమా. ఇప్పటివరకు చాలా సినిమాలు చేశాను. కానీ నాకెప్పుడూ ఇలా అనిపించలేదు. హ్యాపీగా అమెరికాలో లైఫ్ గడుపుతున్న రాజేష్ సినిమా మీద ప్యాషన్ తో ఇక్కడికి వచ్చి నన్ను నమ్మి నాతో సినిమా చేసాడు. నిర్మాతగా, దర్శకుడిగా ఆయన కథ మీద నమ్మకంతో ఎంతో గట్స్, కాన్ఫిడెన్స్ తో నిర్మించారు. ఈ సినిమాను ఇప్పటికే ఇండస్ట్రీలో కొంత మందికి చూపించాం. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ప్రయాణంలో రాజేష్ నాకు ఓ బ్రదర్‌లా మారిపోయారు. నాకు కాలికి గాయమైనా కాలికి సపోర్ట్ పెట్టుకొని తక్కువ రోజుల్లోనే రాజేష్ గారి కోసం ఈ సినిమా చేశాను. జూన్ 21న మా సినిమా ఆరాబోతుంది. నేను చాలా సంవత్సరాల తర్వాత ఇలా నా సినిమాలు ఒక ఈవెంట్ జరుపుకుంటున్నాను అని తెలిపాడు.

నింద సినిమా దర్శక, నిర్మాత రాజేష్ జగన్నాథం మాట్లాడుతూ.. మా ఈవెంట్‌కు నిఖిల్ గారు వచ్చినందుకు థ్యాంక్స్. నింద మూవీ అవుట్ పుట్ చూశాక నాకు సంతృప్తి కలిగింది. నేను ఆల్రెడీ విజయం సాధించాను. చిన్నారావు గారు, శిరీష గారు నాకు సపోర్ట్ చేసారు. మ్యూజిక్ డైరెక్టర్ సాంతు, ఎడిటర్ అనిల్, కెమెరామెన్ రమీజ్ ఈ చిత్రానికి మెయిన్ పిల్లర్స్గా నిలబడ్డారు. నా డైరెక్షన్ టీమ్ అందరికి థ్యాంక్స్. ఈ సినిమాతో నాకు వరుణ్ లాంటి మంచి బ్రదర్ దొరికాడు. ఆయన నింద సినిమాతో కమ్ బ్యాక్ ఇస్తాడు. నింద సినిమాతోనే దానికి నాంది పడుతుంది అని అన్నారు.