Mr Bachchan : రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ గ్లింప్స్ రిలీజ్.. యాక్షన్‌తో అదరగొట్టిన మాస్ మహారాజ..

తాజాగా మిస్టర్ బచ్చన్ సినిమా నుంచి షో రీల్ అని ఓ వీడియో గ్లింప్స్ రిలీజ్ చేసారు.

Mr Bachchan : రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ గ్లింప్స్ రిలీజ్.. యాక్షన్‌తో అదరగొట్టిన మాస్ మహారాజ..

Raviteja Harish Shankar Mr Bachchan Show Reel Video Glimpse Released

Mr Bachchan Show Reel : హరీష్ శంకర్(Harish Shankar) రవితేజ(Raviteja) కాంబోలో మిస్టర్ బచ్చన్ సినిమా తెరకెక్కుతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ భాగ్యశ్రీ హీరోయిన్ గా నటిస్తుంది, జగపతి బాబు విలన్ గా నటిస్తున్నాడు. బాలీవుడ్ లో హిట్ అయిన అజయ్ దేవగన్ రైడ్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

Also Read : NTR Childrens : ఫ్యామిలీతో దేవర షూటింగ్‌కి ఎన్టీఆర్.. ఎన్టీఆర్ పిల్లల్ని చూశారా..? అప్పుడే పెద్దోళ్ళు అయిపోయారు..

మిస్టర్ బచ్చన్ సినిమా నుంచి ఇప్పటివరకు ఫస్ట్ లుక్ పోస్టర్స్ మాత్రమే వచ్చాయి. తాజాగా మిస్టర్ బచ్చన్ సినిమా నుంచి షో రీల్ అని ఓ వీడియో గ్లింప్స్ రిలీజ్ చేసారు.

ఇందులో హీరో ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుంటాడు. ఓ పెద్ద రాజకీయ నాయకుడి ఇంటికి రైడ్ కి వెళ్తే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కున్నాడు అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ షో రీల్ లో డైలాగ్స్ ఏం లేకుండా కేవలం యాక్షన్ సీన్స్ తో అదరగొట్టేసాడు రవితేజ. 1990 బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. యాక్షన్ తో పాటు లవ్ కూడా ఉండబోతున్నట్టు తెలుస్తుంది.