Indraja : జబర్దస్త్ వదిలేస్తున్న ఇంద్రజ.. స్టేజిపై ఏడుస్తూ..

ప్రస్తుతం జబర్దస్త్ లో కృష్ణ భగవాన్, ఇంద్రజ జడ్జీలుగా చేస్తున్నారు.

Indraja : టీవీ షోలలో అందర్నీ నవ్వించే కామెడీ స్కిట్స్ తో జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోలు ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తున్నాయి. జబర్దస్త్ మొదలైన దగ్గర్నుంచి కమెడియన్స్, జడ్జిలు ఎంతోమంచి వచ్చి వెళ్తూనే ఉన్నారు. కమెడియన్స్ ఎంతమంది వచ్చి వెళ్లినా జడ్జిలు మాత్రం తక్కువే. గతంలో రోజా, నాగబాబు ఈ కామెడీ షోలకు జడ్జీలుగా ఏళ్ళ తరబడి ఉన్నారు. కానీ పొలిటికల్ బిజీ వల్ల ఇద్దరూ జబర్దస్త్ ని వదిలేసారు.

ప్రస్తుతం జబర్దస్త్ లో కృష్ణ భగవాన్, ఇంద్రజ జడ్జీలుగా చేస్తున్నారు. ఎక్స్‌ట్రా జబర్దస్త్ లో కృష్ణ భగవాన్ తో పాటు కుష్బూ చేస్తుంది. అయితే ఇంద్రజ జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా చేస్తూ తన సెకండ్ ఇన్నింగ్స్ లో పలు సినిమాలు కూడా చేస్తూ బిజీగానే ఉంది. ఇక జబర్దస్త్ లో ఎవరికైనా కష్టం వస్తే అండగా నిలబడి అందరికి దగ్గరైంది. గత కొన్నాళ్లుగా జబర్దస్త్ చేస్తూ ఇంద్రజ ఇంకా ఇక్కడే ఉంటుంది అనుకునే టైములో జబర్దస్త్ వదిలేసి వెళ్తున్నట్టు తెలిపింది.

Also Read : Chiranjeevi : సీనియర్ జర్నలిస్ట్‌కు ఫ్రీగా ఆపరేషన్ చేయించిన చిరంజీవి.. మెగాస్టార్‌పై మరోసారి ప్రశంసలు..

తాజాగా రిలీజ్ చేసిన జబర్దస్త్ ప్రోమోలో ఇంద్రజ మాట్లాడుతూ.. జబర్దస్త్ కి కొంచెం గ్యాప్ ఇస్తున్నాను అని వీడ్కోలు చెప్తూ స్టేజిపైనే ఏడ్చేసింది. తనకు బాగా ఇష్టమైన నూకరాజుని హత్తుకొని ఎమోషనల్ అయింది. దీంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది. అయితే గ్యాప్ ఇస్తున్నాను అని చెప్పడంతో మళ్ళీ కొన్నాళ్ల తర్వాత వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఇంద్రజ మళ్ళీ జబర్దస్త్ కి వస్తుందా రాదా చూడాలి.

 

ట్రెండింగ్ వార్తలు