Chiranjeevi : సీనియర్ జర్నలిస్ట్‌కు ఫ్రీగా ఆపరేషన్ చేయించిన చిరంజీవి.. మెగాస్టార్‌పై మరోసారి ప్రశంసలు..

తాజాగా ఓ సీనియర్ సినిమా జర్నలిస్టుకు తన డబ్బుతో ఆపరేషన్ చేయించారు మెగాస్టార్.

Chiranjeevi : సీనియర్ జర్నలిస్ట్‌కు ఫ్రీగా ఆపరేషన్ చేయించిన చిరంజీవి.. మెగాస్టార్‌పై మరోసారి ప్రశంసలు..

Megasta Chiranjeevi Helps to Senior Film Journalist Operation

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో హీరోగా అభిమానులను, ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా రియల్ లైఫ్ లో కూడా ఎంతోమందికి సేవా కార్యక్రమాలు చేసి అండగా నిలిచారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా ఎంతోమంది ప్రాణాలు కాపాడారు. విపత్తుల సమయంలో, అభిమానులు, సినిమా వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు తన వంతు సాయం అందిస్తారు. పలు హాస్పిటల్స్ తో మంచి సంబంధాలు ఏర్పరుచుకొని సినీ పరిశ్రమలోని యూనియన్స్ కు హెల్త్ కార్డులు ఇప్పిస్తారు మెగాస్టార్.

ఒక్కోసారి చిరంజీవి కొంతమందికి అన్ని తానై చూసుకుంటారు. తాజాగా ఓ సీనియర్ సినిమా జర్నలిస్టుకు తన డబ్బుతో ఆపరేషన్ చేయించారు మెగాస్టార్. సినీ పరిశ్రమలో సీనియర్ సినిమా జర్నలిస్ట్ ప్రభు ఇటీవల మెడికల్ టెస్టులు చేయించుకోగా హార్ట్ లో 80% బ్లాకులు ఉన్నట్టు చెప్పి యాంజియో గ్రామ్ చేసి బైపాస్ సర్జరీ చేయాలి అన్నారు. అయితే ప్రభు చిరంజీవికి క్లోజ్ అవ్వడంతో సెకండ్ ఒపీనియన్ కోసం చిరంజీవిని సంప్రదించారు.

Also Read : Neha Shetty : షూటింగ్ సమయంలో ఎండలకు కొంతమందికి వడదెబ్బ తగిలింది..

దీంతో చిరంజీవి హైదరాబాద్ స్టార్ హాస్పటల్ డాక్టర్స్ కు ఫోన్ చేసి అన్ని ఏర్పాట్లు చేయించి ప్రభుని అడ్మిట్ చేయించారు. బైపాస్ చేయాల్సిన పని లేకుండా స్టంట్స్ మాత్రం వేసి ప్రాబ్లెమ్ క్లియర్ చేసారు డాక్టర్స్. హాస్పిటల్ లో ప్రభుని ఒక్క రూపాయి కూడా కట్టనివ్వకుండా అన్ని తానై చూసుకున్నారు మెగాస్టార్. జర్నలిస్ట్ ప్రభు నేడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో జర్నలిస్ట్ ప్రభు చిరంజీవికి రుణపడి ఉంటాను అని కృతజ్ఞతలు చెప్పగా మిగిలిన జర్నలిస్టులు, సినీ ప్రముఖులు చిరంజీవికి థ్యాంక్స్ చెప్తున్నారు. ఇక ఈ విషయం తెలిసి అభిమానులు, నెటిజన్లు మరోసారి చిరంజీవిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.