Rajamouli : ఆ అవార్డు తీసుకోనంటే.. రాజమౌళిని తిట్టిన సిరివెన్నెల సీతారామశాస్త్రి..

ఓ సారి ఒక అవార్డు తీసుకోనంటే దివంగత పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తనని తిట్టినట్టు రాజమౌళి తెలిపాడు.

Rajamouli : తీసిన ప్రతి సినిమాతోటి హిట్ కొట్టి బోలెడన్ని కలెక్షన్స్, అవార్డులు, రివార్డులు సాధించారు రాజమౌళి. RRR సినిమాతో ఆస్కార్ కూడా సాధించి, హాలీవుడ్ లో కూడా గుర్తింపు తెచ్చుకొని తన రాబోయే సినిమాపై బోలెడంత హైప్ వచ్చేలా చేశాడు. అయితే ఓ సారి ఒక అవార్డు తీసుకోనంటే దివంగత పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తనని తిట్టినట్టు రాజమౌళి తెలిపాడు.

ఇటీవల సిరివెన్నెల సీతారామశాస్త్రిని స్మరిస్తూ నా ఉఛ్వాసం కవనం అనే ఓ ఇంటర్వ్యూ సిరీస్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు వస్తూ సిరివెన్నెలతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటున్నారు. ఈ క్రమంలో రాజమౌళి కూడా వచ్చారు. రాజమౌళి వారిద్దరి మధ్య జరిగిన ఓ సంఘటన గురించి తెలిపారు.

Also Read : Indraja : జబర్దస్త్ వదిలేస్తున్న ఇంద్రజ.. స్టేజిపై ఏడుస్తూ..

రాజమౌళి మాట్లాడుతూ.. నా పనిని మెచ్చుకుంటే నాకు సంతోషంగానే ఉంటుంది. కానీ కొంతమంది నన్ను పొగుడుతారు. నాకు పద్మశ్రీ అవార్డు వచ్చినప్పుడు తీసుకోడానికి నేను వెళ్ళకూడదు అనుకున్నాను. ఆ విషయం ఎవర్ని నొప్పించకుండా ఎలా చెప్పాలో అర్ధం కాలేదు. అదే సమయంలో శాస్త్రి గారు ఫోన్ చేస్తే నేను పద్మశ్రీ అవార్డు తీసుకోడానికి వెళ్లట్లేదు అని చెప్పాను. దీంతో నన్ను మొదటిసారి ఆయన కోపంగా తిట్టారు. భారత ప్రభుత్వం నువ్వు పద్మశ్రీకి అర్హుడివి అని భావించి నీకు గౌరవం ఇస్తూ పురస్కారం ఇస్తుంటే ఎందుకు తీసుకోవు. అతిగా వేశాలు వేయకుండా నోరు మూసుకొని వెళ్లి తీసుకో అని తిట్టారు. అయన చెప్పాకే నేను వెళ్లి పద్మశ్రీ అవార్డు తీసుకున్నాను. ఇండస్ట్రీలో ఆయన నన్ను నంది అని పిలుస్తారు అని తెలిపారు. దీంతో రాజమౌళి వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.

ట్రెండింగ్ వార్తలు