New Survey On Lies : అబద్ధాలు ఎక్కువగా చెప్పేది అబ్బాయిలేనట.. అమ్మాయిలు కాదట

అబద్ధాలు చెబితే ఆడపిల్లలు పుడతారు అంటారు. ఇప్పుడు మగ పిల్లలు పుడతారు అనాలేమో? ఎందుకంటే ఆడవారి కంటే మగవారు ఎక్కువగా అబద్ధాలు ఆడతారని సర్వేలు చెబుతున్నాయి.

New Survey On Lies

New Survey On Lies : అస్సలు అబద్ధాలు చెప్పని వారిని సత్య హరిశ్చంద్రుడితో పోలుస్తారు. అలా చెప్పని ఆడవారు, మగవారు ఉంటారంటారా? అదేమో కానీ.. ఆడవారితో పోలిస్తే మగవారు ఎక్కువగా అబద్ధాలు చెబుతున్నారట. కొత్త సర్వేలు చెబుతున్నాయి.

Pinocchio Effect : మీరు అబద్ధం చెబితే మీ ముక్కు చెప్పేస్తుంది

అబద్ధాలు ఎవరు ఎక్కువగా చెబుతారు? అనే సర్వేలు చాలా చోట్ల జరగుతున్నాయి. ఏ సర్వే అయినా ఒకటే చెబుతోంది. మగవారు ఎక్కువగా అబద్ధాలు చెబుతారట. అమెరికాలో 1980 నుంచి 2021 మధ్య జన్మించిన వారిపై సర్వే చేశారట. చిన్నా, పెద్దా అనే వయసు తారతమ్యం లేకుండా చేసిన సర్వేలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఈ సర్వేలో ఎక్కువగా అబ్బాయిలు అబద్ధాలు చెబుతామని.. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో తప్పుడు వివరాలు పెడతామని పేర్కొన్నారట. అయితే తమకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకూడదనే కారణంగా అబద్ధాలు చెబుతామని వారు చెప్పారట. అందరిలో చులకన కాకూడదని కొందరు.. వ్యక్తిగత రక్షణ కోసం అని మరికొందరు ఈ సర్వేలో చెప్పుకొచ్చారట. ఆడవారితో పోలిస్తే మగవారు రోజులో ఒక్కసారైనా అబద్ధం చెబుతారట.

లండన్‌లో జరిగిన మరో సర్వే కూడా ఇదే విషయాన్ని పేర్కొంది. పురుషుడు సంవత్సరంలో 1,092 అబద్ధాలు చెబితే, స్త్రీ సంవత్సరానికి 728 అబద్ధాలు చెబుతుందట. అయితే అబద్ధం చెప్పిన తరువాత మగవారు అబద్ధాన్ని ఒప్పుకోవడంతోపాటు ఆడవారికంటే ఎక్కువగా బాధపడతారట.

Anger Management : కోపంతో ఉన్నప్పుడు నివారించాల్సిన 6 ఆహారాలు ఇవే !

మగవారు చెప్పే అబద్ధాల లిస్ట్ :
నా ఫోన్‌లో సిగ్నల్ లేదు
నేను దారిలో ఉన్నాను
నేను ట్రాఫిక్‌లో చిక్కుకున్నాను
నేను మీ కాల్ మిస్ అయ్యాను
మీరు బరువు తగ్గారు

ఆడవారు చెప్పే అబద్ధాల లిస్ట్ :
నేను బాగానే ఉన్నాను
అది ఎక్కడ ఉందో నాకు తెలీదు
నేను దానిని ముట్టుకోలేదు
అంత ఖరీదైనది కాదు
నాకు తలనొప్పిగా ఉంది

చదువుతుంటే సిల్లీగా అనిపించినా సింపుల్‌గా తప్పించుకోవడానికి ఆడవారు, మగవారు చెప్పే అబద్ధాలు ఇలాగే ఉంటాయట.

ట్రెండింగ్ వార్తలు