ఏపీలో సంచలనం రేపిన మదనపల్లె ఘటనలో ట్విస్ట్..

జిల్లాల విభజన తర్వాత పుంగనూరు భూముల దస్త్రాలు చిత్తూరు కలెక్టరేట్ లో కాకుండా మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులోనే ఎందుకు ఉంచారు? అనే కోణంలోనూ దర్యాఫ్తు కొనసాగుతోంది.

Madanapalle Incident : అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైళ్ల దగ్ధం కేసులో విచారణ వేగవంతం చేశారు అధికారులు. మదనపల్లె వైసీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి సమీప బంధువు మాధవ రెడ్డి ఇంట్లో తనిఖీలు చేపట్టారు పోలీసులు. సబ్ కలెక్టర్ ఆఫీసులో అగ్నిప్రమాదం వెనుక మాధవరెడ్డి పాత్రపై పోలీసులు విచారణ చేపట్టారు. రెవెన్యూ, పోలీసు అధికారులు సంయుక్తంగా కలిసి మదనపల్లె రెడ్డిస్ కాలనీలోని మాధవరెడ్డి ఇంట్లో
సోదాలు జరిపారు. మాధవ రెడ్డి ఇంట్లో పలు ల్యాండ్ డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం ఘటనను సీరియస్ గా తీసుకున్న సీఎం చంద్రబాబు.. దీనిపై లోతైన విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. ఫైర్ సేఫ్టీ డైరెక్టర్, ఏపీ జెన్కో సీఎండీలను సైతం ఘటనా స్థలానికి వెళ్లి విచారణ జరపాలని ఆదేశించింది ఏపీ ప్రభుత్వం. ఈ
నేపథ్యంలో నాగ్ పూర్ నుంచి ప్రత్యేక నిపుణుల బృందం (నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ సేఫ్టీ ఇంజినీరింగ్ సంస్థ) మదనపల్లి రానుంది.

ఫైళ్ల దగ్ధంలో కుట్రలను తేల్చేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తోంది ప్రభుత్వం. చిన్న ఆధారం దొరికినా వదలకుండా పట్టుకోవాలనే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. జిల్లాల విభజన తర్వాత పుంగనూరు భూముల దస్త్రాలు చిత్తూరు కలెక్టరేట్ లో కాకుండా మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులోనే ఎందుకు ఉంచారు? అనే కోణంలోనూ దర్యాఫ్తు కొనసాగుతోంది.

Also Read : ఒక్క ఓటమితో అంతా తారుమారు.. రోజా పొలిటికల్ కెరీర్ ముగిసినట్టేనా? ఎందుకీ దుస్థితి?

ట్రెండింగ్ వార్తలు