Niharika – Chaitanya : నాలుగు నెలల తర్వాత నిహారిక భర్త చైతన్య వైరల్ పోస్ట్.. మెడిటేషన్ సెంటర్‌లో!

నిహారిక కొణిదెల భర్త చైతన్య సోషల్ మీడియాలో వైరల్ పోస్ట్ పెట్టాడు. సంతోషం పొందడం కోసం ముంబైలోని మెడిటేషన్ సెంటర్‌లో తాను..

Niharika Konidela husband Chaitanya Jonnalagadda viral post after 4 months break

Niharika Konidela – Chaitanya Jonnalagadda : మెగా డాటర్ నిహారిక కొణిదెల 2020 డిసెంబర్ 9న జొన్నలగడ్డ వెంకట చైతన్య అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మెగా, అల్లు ఫ్యామిలీలతో పాటు ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖుల మధ్య రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌లోని ఒబెరాయ్ ఉదయ్ విలాస్‌లో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఆ తరువాత ఓ రెండేళ్ల పాటు వీరిద్దరూ బాగానే ఉన్నారు.

Rajamouli : రాజమౌళికి అరుదైన గౌరవం.. ISBC చైర్మ‌న్‌గా నియామకం..

అయితే సడన్ గా ఏమైందో తెలియదు. ఇరువురు సోషల్ మీడియాలో అన్ ఫాలో కొట్టుకోవడం, ఇద్దరికీ సంబంధించిన పోస్టులను తమ అకౌంట్స్ ని తొలిగించడం అందరిలో అనుమానాలు మొదలయ్యేలా చేశాయి. విడాకులు తీసుకోబోతున్నారా అన్న వార్తలు రావడం మొదలయ్యాయి. ఇక మెగా ఫ్యామిలీ ఫంక్షన్స్ లో కూడా చైతన్య కనిపించకపోవడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. తాజాగా చైతన్య తన ఇన్‌స్టాగ్రామ్ లో చేసిన పోస్ట్ నెట్టింట హాట్ టాపిక్ అయ్యింది.

Keeda Cola Harikanth : సినిమా రిలీజ్‌కి ముందే టాలీవుడ్ యువనటుడు గుండెపోటుతో మృతి..

గత నాలుగు నెలలుగా చైతన్య సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండడం లేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో చివరి పోస్ట్ వేశాడు. మళ్ళీ ఇప్పుడు ముంబైలోని ‘గ్లోబల్ విపస్సనా పగోడా’ (Global Vipassana Pagoda) మెడిటేషన్ సెంటర్ ఫోటో షేర్ చేస్తూ.. “ఇక్కడికి నన్ను వచ్చేలా చేసిన ప్రతిఒక్కరికి నా కృతజ్ఞతలు. ఒక ప్రదేశానికి మనం ఎటువంటి అంచనాలు లేకుండా వెళ్లి ఎంతో జ్ఞానంతో తిరిగి వస్తాం. ఇక చాలా కొందిమంది లైఫ్ లో జరుగుతుంది. ఆలా నేను ఇక్కడికి వచ్చి 10 రోజులు నుంచి విపస్సనా యోగను చేయడం వల్ల నా లైఫ్ ఇప్పుడు కొంచెం సంతోషంగా, హాయిగా ఉంది” అంటూ చెప్పుకొచ్చాడు.

దీంతో చైతన్య ఇన్నాళ్లు బాధలో ఉన్నట్లు భావించి నెటిజెన్స్ తనకి ధైర్యం చెబుతూ కామెంట్ చేస్తున్నారు. కాగా నిహారిక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉండడమే కాకుండా.. వెబ్ సిరీస్ ని నిర్మిస్తూ, నటిస్తూ ఫుల్ ఫార్మ్ లో ఉంది.

 

 

ట్రెండింగ్ వార్తలు