Paris Olympics 2024 : ఒలింపిక్స్‌లో నాలుగో రోజు భారత షెడ్యూల్.. మను మళ్లీ మురిపిస్తుందా..?
పారిస్ ఒలింపిక్స్ 2024 నాలుగో రోజుకు చేరుకుంది.
- Thota Vamshi Kumar
- Published On : July 30, 2024 / 08:31 AM IST
India Schedule and Medal Events At Paris Olympics 2024 Day 4
Paris Olympics : పారిస్ ఒలింపిక్స్ 2024 నాలుగో రోజుకు చేరుకుంది. భారత అభిమానుల అందరి దృష్టి 10మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ కాంస్య పతక మ్యాచ్‌పైనే ఉంది. సరబ్‌జోత్-మను బాకర్ జోడి దక్షిణకొరియా బృందంతో తలపడనుంది. భారత విజయం సాధిస్తే మరో కాంస్యం పతకం సొంతం కానుంది. అంతే కాకుండా.. ట్రాప్ షూటర్ పృథ్వీరాజ్ తొండైమాన్ ఫైనల్‌కు అర్హత సాధిస్తే పతకం సాధించే అవకాశం ఉంది. ఐర్లాండ్ మ్యాచ్‌తో భారత హాకీ జట్టు తిరిగి విజయాల బాట పట్టాలని చూస్తోంది. ముగ్గురు అగ్రశ్రేణి భారత బాక్సర్లు – అమిత్ పంఘల్, జైస్మిన్ లంబోరియా, ప్రీతి పవార్‌లు తమ సత్తా చాటాలని భావిస్తున్నారు.
ఒలింపిక్స్‌లో నాలుగో రోజు భారత షెడ్యూల్..
ఆర్చరీ..
మహిళల వ్యక్తిగత విభాగం అంకిత భకత్ (సాయంత్రం 5:14గంటలకు), భజన్ కౌర్ (సాయంత్రం 5:27గంటలకు)
పురుషుల వ్యక్తిగత విభాగం ధీరజ్ బొమ్మదేవర (రాత్రి 10:46 గంటలకు)
Paris Olympics 2024 : చరిత్ర సృష్టించిన సాత్విక్-చిరాగ్..!
బ్యాడ్మింటన్..
పురుషుల డబుల్స్ (గ్రూప్ స్టేజ్)
సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి -చిరాగ్ శెట్టి vs అల్ఫియాన్ ఫజార్ -ముహమ్మద్ రియాన్ అర్డియాంటో (ఇండోనేషియా) – సాయంత్రం 5:30 గంటలకు
మహిళల డబుల్స్ (గ్రూప్ స్టేజ్)..
అశ్విని పొన్నప్ప – తనీషా క్రాస్టో vs సెట్యానా మపాసా -ఏంజెలా యు (ఆస్ట్రేలియా) – సాయంత్రం 6:20 గంటలకు
బాక్సింగ్..
పురుషుల 51 కేజీల ప్రీక్వార్టర్స్ అమిత్ పంఘల్ vs పాట్రిక్ చినియెంబా (జాంబియా) – రాత్రి 7:16 గంటలకు
మహిళల 57 కేజీల రౌండ్ ఆఫ్ 32 జైస్మిన్ లంబోరియా vs నెస్తీ పెటెసియో (ఫిలిప్పీన్స్) – రాత్రి 9:24 గంటలకు
మహిళల 54 కేజీల రౌండ్ ఆఫ్ 16 ప్రీతి పవార్ vs యెని మార్సెలా అరియాస్ (కొలంబియా) – తెల్లవారుజామున 1:22 (జూలై 31)
Manu Bhaker : మను భాకర్‌పై రూ.2 కోట్లు ఖర్చు చేశాం.. తగిన ఫలితం దక్కిందన్న కేంద్ర మంత్రి
ఈక్వెస్ట్రియన్..
డ్రెస్సేజ్ ఇండివిజువల్ గ్రాండ్ ప్రిక్స్అ నూష్ అగర్వాలా – మధ్యాహ్నం 2:30 గంటలకు
హాకీ..
ఇండియా vs ఐర్లాండ్ – సాయంత్రం 4:45గంటలకు
రోయింగ్..
పురుషుల సింగిల్స్ స్కల్స్ – క్వార్టర్-ఫైనల్స్ బాల్‌రాజ్ పన్వార్ – మధ్యాహ్నం 1:40 గంటలకు
షూటింగ్..
ట్రాప్ పురుషుల అర్హత : పృథ్వీరాజ్ తొండైమాన్ – మధ్యాహ్నం 12:30 గంటలకు
ట్రాప్ మెన్స్ ఫైనల్ (అర్హతకు లోబడి) – సాయంత్రం 7 గంటలకు
ట్రాప్ మహిళల అర్హత : శ్రేయసి సింగ్ -రాజేశ్వరి కుమారి – మధ్యాహ్నం 12:30గంటలకు
10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ కాంస్య పతక మ్యాచ్ మను భాకర్ -సరబ్జోత్ సింగ్ vs దక్షిణ కొరియా – మధ్యాహ్నం 1గంటకు
