Paris Olympics 2024 : చరిత్ర సృష్టించిన సాత్విక్-చిరాగ్..!
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి-చిరాగ్ శెట్టిలు అదరగొడుతున్నారు.

Satwiksairaj Rankireddy-Chirag Shetty enter Olympics quarterfinals
Paris Olympics : పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి-చిరాగ్ శెట్టిలు అదరగొడుతున్నారు. ఒలింపిక్స్ చరిత్రలోనే క్వార్టర్స్ చేరిన తొలి భారత బ్యాడ్మింటన్ జోడీగా చరిత్ర సృష్టించారు. గ్రూప్ దశలో వీరిద్దరూ అద్భుత ప్రదర్శన చేసి టాప్-8లో నిలిచారు.
సోమవారం జర్మనీ జోడీ మార్క్-మెర్విన్‌తో జరగాల్సిన డబుల్స్ మ్యాచ్ రద్దైంది. జర్మన్ ఆటగాడు మార్క్‌కు మోకాలికి గాయం కావడంతో అతను టోర్నీ నుంచి తప్పుకున్నాడు. దాంతో నిర్వాహకులు ఈ మ్యాచ్‌ను రద్దు చేశారు. గ్రూప్ సిలో ఆర్టియాంటో-ఆల్పియన్(ఇండోనేషియా) చేతిలో 21-13, 13-10 తేడాతో ఫ్రెంచ్ జోడీ లాబార్-కోర్వీ ఓడిపోవడంతో సాత్విక్-చిరాగ్ జోడీ క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది.
Yashasvi Jaiswal : యశస్వి జైస్వాల్ అరుదైన ఘనత.. ఈ ఏడాది ఇతనొక్కడే..
దూసుకుపోతున్న లక్ష్యసేన్..
పారిస్ ఒలింపిక్స్ 2024లో లక్ష్యసేన్ దూసుకుపోతున్నాడు. గ్రూపు స్టేజీలో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించాడు. బెల్జియంకు చెందిన జూలియన్ కరాగీని 21-19, 21-14 తేడాతో ఓడించాడు. తొలి సెట్‌లో లక్ష్యసేన్‌కు కరాగీని నుంచి పోటీ ఎదురైంది. అయితే.. రెండో సెట్‌లో మాత్రం ఈజీగా గెలుచుకున్నాడు. ఇక తన తరువాతి మ్యాచ్‌లో జోనాథన్ క్రిస్టీతో తలపడనున్నాడు.
ఇదిలా ఉంటే.. లక్ష్య సేన్ గెలిచిన తొలి మ్యాచ్‌ను ఒలింపిక్స్ నిర్వాహకులు రద్దు చేశారు. ప్రత్యర్థి ఆటగాడు కెవిన్ గాయం కారణంగా తప్పుకోవడంతో నిబంధనల ప్రకారం మ్యాచ్‌ను రద్దు చేశారు.
Manu Bhaker : మను భాకర్‌పై రూ.2 కోట్లు ఖర్చు చేశాం.. తగిన ఫలితం దక్కిందన్న కేంద్ర మంత్రి