Hardik Pandyas special wish for son Agastya Happy Birthday my partner in crime
Hardik Pandya – Agastya : టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగపు పోస్ట్‌ను పంచుకున్నాడు. తన కుమారుడు అగస్త్యకు పుట్టిన రోజు సందర్బంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో కొడుకుతో అల్లరి చేసిన ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో అగస్త్య తన తండ్రి చేసే పనులను కాపీ చేయడం చూడవచ్చు.
మొదటగా అగస్త్యకు ఫ్లయింగ్ కిస్‌లు ఎలా ఇవ్వాలో నేర్పించడంతో వీడియో ప్రారంభమైంది. పాండ్య చేసిన విధంగానే అగస్త్య చేయడానికి ప్రయత్నాలను చూడొచ్చు. తండ్రీ కొడుకులు కలిసి ‘జెంగా’ అనే గేమ్‌ను ఆడారు. ఇక కొడుకు చేసే పనులను చూసి హార్దిక్ సంతోషంలో మునిగిపోయాడు.
Team India : ‘సూర్యకుమార్ యాదవ్ తాత్కాలిక కెప్టెనే.. సరైన నాయకుడు అతడే..’
‘ప్రతి రోజు నా బలానికి మీరే మూలం. క్రైమ్‌లో నా భాగస్వామి, నా అగు కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను.. ఉంటాను.’ అని హార్దిక్ ఆ వీడియో కింద రాసుకొచ్చాడు. హార్దిక్ పోస్ట్ వైరల్‌గా మారింది. జూనియర్ పాండ్యాకు పుట్టిన రోజు శుభాకాంక్షలను నెటీజన్లు తెలియజేస్తున్నారు.
హార్దిక్, నటాసా స్టాంకోవిచ్‌లకు జూలై 30, 2020న అగస్త్య జన్మించాడు. కాగా.. నాలుగేళ్ల అనుబంధం తర్వాత భార్య నటాసా స్టాంకోవిచ్‌తో విడిపోతున్నట్లు హార్దిక్ పాండ్యా ప్రకటించాడు. నెలల ఊహాగానాల తర్వాత హార్దిక్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా జూలై 18 గురువారం తన నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రస్తుతం నటాసా తన స్వస్థలం సెర్బియాలో తన కొడుకు అగస్త్యతో కలిసి ఉంటోంది.
ఇక హార్దిక్ ప్రస్తుతం శ్రీలంకతో టీ20 సిరీస్ ఆడుతున్నాడు. ప్రస్తుతం అతడు లంకలో ఉన్నాడు. వ్యక్తిగత కారణాలతో అతడు వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.