సూపర్ డ్యాన్స్ భయ్యా..! రోడ్డుపై డ్యాన్స్ చేస్తూ ట్రాఫిక్ పోలీస్ విధులు.. వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా..

ట్రాఫిక్ విధులు నిర్వర్తించడం అంటే ఆషామాషీ కాదు. రద్దీగా ఉండే రోడ్లపై నలువైపుల నుంచి వచ్చే వాహనాలను కంట్రోల్ చేస్తూ ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా..

Anand Mahindra

Anand Mahindra : ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. తన ఎక్స్ ఖాతాలో నిత్యం ఆసక్తికర వీడియోలను షేర్ చేస్తుంటారు. తాజాగా మరో ఆసక్తికర వీడియోను ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. ఈ వీడియోలో ట్రాఫిక్ పోలీస్ డ్యాన్స్ చేస్తూ వచ్చిపోయే వాహనాల రద్దీని క్లియర్ చేస్తున్నాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్యర్యం వ్యక్తం చేస్తూ ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read : పెంపుడు కుక్కకు అతిగా ఆహారం పెట్టినందుకు మహిళకు జైలు శిక్ష.. ఎక్కడో తెలుసా?

ట్రాఫిక్ విధులు నిర్వర్తించడం అంటే ఆషామాషీ కాదు. రద్దీగా ఉండే రోడ్లపై నలువైపుల నుంచి వచ్చే వాహనాలను కంట్రోల్ చేస్తూ ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా వాహనదారులకు సూచనలు చేస్తుండాలి. ఈ క్రమంలో విధుల్లో ఏ మాత్రం ఏమరపాటు ప్రదర్శించినా వాహనదారులకు ఇబ్బందులు ఎదురవడంతోపాటు.. ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో ట్రాఫిక్ పోలీసులు రద్దీ ప్రదేశాల్లో ట్రాఫిక్ నియంత్రించే క్రమంలో అప్రమత్తంగా ఉంటారు. కొందరు తమ విధులను ఇష్టంగా చేస్తే.. మరికొందరు కష్టంగా చేస్తుంటారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ ట్రాఫిక్ పోలీసు వినూత్న రీతిలో తన విధులు నిర్వర్తిస్తున్నాడు.

Alsol Read : SIM Subscription Fraud : సిమ్ కార్డు మోసాలపై తెలంగాణ పోలీసుల కీలక అధ్యయనం..!

రోడ్డుపై డ్యాన్స్ చేస్తూ వచ్చిపోయే వాహనాల రద్దీని ట్రాఫిక్ పోలీస్ క్లియర్ చేస్తున్నాడు. అతడు తన పనిని ఆస్వాదిస్తున్న తీరునుచూసి వాహనదారులతో పాటు సోషల్ మీడియాలో నెటిజన్లు ఆశ్చర్య పోతున్నారు. ఎలాంటి విసుగు, నీరసం లేకుండా ట్రాఫిక్ పోలీస్ విధులు నిర్వర్తించడాన్ని చూసి నెటిజన్లు అభినందిస్తున్నారు. ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. ఫలానా పని బోరింగ్ అంటూ ఏమీ ఉండదు. ఏ పనిలోనైనా ఆనందం వెతుక్కోవచ్చని నిరూపించాడు ఈ పోలీసు అని ఆనంద్ మహీంద్రా అభినందిస్తూ రాశారు. ఈ వీడియోకు మండే మోటివేషన్ వీడియో అంటూ రాశారు.  వీడియోను చూసిన నెటిజన్లుసైతం మీ డ్యాన్స్ సూపర్ భయ్యా అంటూ ట్రాఫిక్ పోలీస్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మరికొందరు మా దగ్గర కూడా ఇలాంటి ట్రాఫిక్ పోలీస్ ఉంటే బాగుండు అంటూ పేర్కొంటున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు