Nithiin: మాచర్ల నియోజకవర్గం సాలిడ్ అప్‌డేట్ ఇదే!

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.....

Nithiin: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు రాజశేఖర్ రెడ్డి తెరకెక్కిస్తుండగా, ఇందులో నితిన్ ఓ సరికొత్త పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఈరోజు ఉదయం ఓ అప్‌డేట్ ఉంటుందని చిత్ర యూనిట్ నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ అప్‌డేట్‌ను రివీల్ చేసింది చిత్ర యూనిట్.

Nithiin: ‘మాచర్ల నియోజకవర్గం’లో మార్చి 24న కొత్త ఆర్డర్!

మాచర్ల నియోజకవర్గం చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మార్చి 26న ఉదయం 10 గంటల 8 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది. ఈ సినిమాలో నితిన్ సిద్ధార్థ్ రెడ్డి అనే ఓ పవర్‌ఫుల్ ఐఏఎస్ పాత్రలో మనకు కనిపించనున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ప్రభుత్వ ఆర్డర్ మాదిరిగా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ఇస్తూ చిత్ర యూనిట్ సరికొత్త రీతిలో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలను క్రియేట్ చేస్తోంది.

Macherla Niyojakavargam: ఐటెం సాంగ్.. బాలీవుడ్ భామను తీసుకొస్తున్న నితిన్

ఇక ఈ సినిమాను పక్కా పొలిటిక్ డ్రామాగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండగా, నితిన్ పాత్ర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో నితిన్ సరసన అందాల భామలు కృతి శెట్టి, కేథరిన్ త్రేసాలు హీరోయిన్లుగా నటిస్తుండగా, ఈ సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. నితిన్ కెరీర్‌లో 31వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

ట్రెండింగ్ వార్తలు