2రోజులు ఫామ్‌హౌస్‌లోనే ప్రముఖులు..! సంచలనం రేపుతున్న బెంగళూరు రేవ్ పార్టీ

తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖలతో ఆ క్రికెట్ బుకీకి లింక్స్ ఉన్నట్లు తెలుస్తోంది. క్రికెట్ బుకీ పిలిస్తేనే పార్టీకి అటెండ్ అయ్యారు పలువురు ప్రముఖులు.

Bangalore Rave Party : బెంగళూరు శివారు ఫామ్ హౌస్ రేవ్ పార్టీ దుమారం సంచలనం రేపుతోంది. మొత్తం పార్టీలో 101 మంది పాల్గొన్నట్లు తెలిసింది. వీరిలో 30మంది యువతులు, 71 మంది పురుషులు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి పార్టీకి భారీ సంఖ్యలో హాజరయ్యారు ప్రముఖులు. మొత్తం రెండు రోజుల పాటు పార్టీ చేసుకున్నారు వీళ్లంతా. బెంగళూరు జీఆర్ ఫామ్ హౌస్ లోనే రెండు రోజులుగా ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీకి హాజరైన వారిలో పలువురు సినీ పరిశ్రమకు చెందిన వారున్నారు. వీరితో పాటు వ్యాపారులు, క్రికెట్ బుకీలు కూడా ఉన్నారు.

రెండు రోజులుగా పార్టీ నిర్వహించడంలో కీలకంగా ఉన్నారో ప్రముఖ క్రికెట్ బుకీ. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖలతో ఆ క్రికెట్ బుకీకి లింక్స్ ఉన్నట్లు తెలుస్తోంది. క్రికెట్ బుకీ పిలిస్తేనే పార్టీకి అటెండ్ అయ్యారు పలువురు ప్రముఖులు. హైదరాబాద్ ఫామ్ హౌస్ లో నిఘా పెరగడంతో బెంగళూరుకు మకాం మార్చినట్లు తెలుస్తోంది. దీంతో బెంగళూరులో వీరిని అదుపులోకి తీసుకుని రేవ్ పార్టీని భగ్నం చేశారు.

అందరి బ్లడ్ శాంపుల్స్ సేకరించిన మెడికల్ టీమ్స్.. రేవ్ పార్టీ నిర్వాహకుడు వాసుతో పాటు నలుగురిని అరెస్ట్ చేశారు. రేవ్ పార్టీకి వెళ్లిన వారిలో నటి హేమ పేరు కూడా ఉంది. అయితే తాను రేవ్ పార్టీకి వెళ్లలేదని, హైదరాబాద్ లోనే ఓ ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నానని ఆమె అంటున్నారు. కానీ, బెంగళూరు పోలీసుల అదుపులో హేమ కూడా కనపడినట్లు తెలిసింది. తాను రేవ్ పార్టీకి వెళ్లలేదు అంటూ ఓ వీడియో రిలీజ్ చేసి తప్పుదోవ పట్టించారంటూ నటి హేమ పై ఆరోపణలు వస్తున్నాయి. మిస్ లీడ్ చేసిన హేమపై మరో కేసు కూడా నమోదు చేసే అవకాశం ఉందంటున్నారు. ఇక, నటుడు శ్రీకాంత్ కూడా తనకు రేవ్ పార్టీతో సంబంధం లేదన్నాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో పలువురు ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read : వీడియో రిలీజ్ చేసి అందరినీ తప్పుదోవ పట్టించిన హేమ!

ట్రెండింగ్ వార్తలు