బాటిళ్లలో పోస్తే ఖబడ్దార్‌! పెట్రోల్‌ బంక్ నిర్వాహకులకు ఈసీ వార్నింగ్‌

ఈసీ ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని హెచ్ పీ పెట్రోల్ బంకు బాటిల్స్ లో పెట్రోల్ విక్రయించింది. దీంతో ఈ పెట్రోల్ బంకును అధికారులు సీజ్ చేశారు.

No Petrol In Bottles : రాష్ట్రంలోని పెట్రోల్ బంకు యజమానులకు ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల అనంతరం జరిగిన అల్లర్లు, దాడుల నేపథ్యంలో బాటిల్స్ లో పెట్రోల్ విక్రయించొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే అల్లర్లు జరిగిన జిల్లాల్లోని పెట్రోల్ బంకుల్లో బాటిళ్లలో పెట్రోల్ నింపడాన్ని ఈసీ నిషేధించింది. తాజాగా ఈ నిషేధాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని బంకుల యజమానులను ఆదేశించింది. ఈసీ ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈసీ హెచ్చరించింది.

ఈసీ తాజా ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ లూజ్ విక్రయాలు ఆగిపోయాయి. ఈసీ ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని హెచ్ పీ పెట్రోల్ బంకు బాటిల్స్ లో పెట్రోల్ విక్రయించింది. దీంతో ఈ పెట్రోల్ బంకును అధికారులు సీజ్ చేశారు. నిబంధనలను ఉల్లంఘించినందుకు పెట్రోల్ బంక్ పై కేసు నమోదు చేశారు. ఏపీలో పోలింగ్ రోజు, తర్వాతి రోజు హింసాత్మక ఘటనలు, అల్లర్లు పెట్రోల్ బాంబుల వల్లే జరిగాయని ఈసీ ప్రాథమిక అంచనాకు వచ్చింది. పెట్రోల్ ని బాటిల్స్, టిన్నుల్లో పోయించుకుని పెట్రోల్ బాంబులను తయారు చేస్తున్నట్లు గుర్తించింది.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం పెట్రోల్ బంకుల్లో బాటిల్స్ లో పెట్రోల్, డీజిల్ విక్రయించకుండా చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా బంకు ఓనర్లకు నోటీసులు జారీ చేసింది. వాహనదారులు, వినియోగదారులకు ఎట్టి పరిస్థితుల్లో బాటిల్స్, క్యాన్స్, టిన్స్ లో పెట్రోల్, డీజిల్ పోయవద్దని సూచించింది. వాహనాల్లో మాత్రమే పోయాలని ఆదేశించింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎంసీసీ) అమలులో భాగంగా జూన్ 10వ తేదీ వరకు ఈ ఆదేశాలు

Also Read : వీడియో రిలీజ్ చేసి అందరినీ తప్పుదోవ పట్టించిన హేమ!

ట్రెండింగ్ వార్తలు