Bangalore Rave Party: రేవ్ పార్టీ కలకలంపై స్పందించిన కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్

‘నిన్న డైరక్టర్స్ డే సందర్భంగా జరిగిన ఈవెంట్ కి, నేడు నా చిరకాల స్నేహితుడిని కలవడానికి ఆసుపత్రికి వెళ్లి ఇప్పటివరకు’..

బెంగళూరు రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఇందులో టాలీవుడ్ ప్రముఖులు కూడా పట్టుబట్టారు. ఆ రేవ్ పార్టీకి తాము వెళ్లలేదని పలువురు వీడియోల రూపంలో చెప్పుకోవాల్సి వస్తోంది. తాజాగా, జానీ మాస్టర్ కూడా దీనిపై స్పందించాడు. తాను ఆ రేవ్ పార్టీకి వెళ్లలేదని అన్నాడు. ఓ వీడియోలో జానీ మాస్టర్ ను పోలి ఓ వ్యక్తి కనపడుతుండడంతో అది తాను కాదని అన్నాడు.

‘హైదారాబాద్ లో నా వాళ్ళ మధ్య తీరిక లేకుండా మా పనుల్లో నిమగ్నమై ఉన్న నేను ఎక్కడో, ఎవరితోనో, ఏదో చేస్తూ కనిపించానని చెబుతూ పుకార్లు లేపారు. మా సేనని, జనసేనానిని ఉద్దేశిస్తూ నోటికొచ్చింది రాస్తున్నారు.

నిన్న డైరక్టర్స్ డే సందర్భంగా జరిగిన ఈవెంట్ కి, నేడు నా చిరకాల స్నేహితుడిని కలవడానికి ఆసుపత్రికి వెళ్లి ఇప్పటివరకు మా అసోసియేషన్ లో ఉన్న నేను ఎలా అక్కడ ప్రత్యక్షమయ్యానో ఈ వార్త చేసిన, చేయించిన మతిలేని మహారథులకే తెలియాలి. చేతకానోడు చెడగొట్టడానికే చూస్తాడు. ఈ వివరణ కూడా వాళ్ల కోసం కాదు నన్ను వాళ్ల కుటుంబంలో ఒకరిలా అనుకునే వాళ్ల కోసం’ అని జానీ మాస్టర్ ఇన్‌స్టాగ్రామ్ లో ఓ వీడియో రూపంలో మాట్లాడాడు.

‘నా గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలిసే మొదటి విషయం నాకు అటువంటి అలవాట్లు లేవని. అనవసరంగా నాపై, మా జనసేనాని పై బురద జల్లే ప్రయత్నం ఇది, ఇలా తప్పుడు ప్రచారాలు చేసే గుంట నక్కల ఏడుపులు తొందర్లోనే వింటాం. ఈ పుకార్ల వెనక నిజాలు తెలుసుకోకుండా నమ్మేసి నోటికొచ్చినట్టు మాట్లాడేస్తున్న, షేర్ చేస్తున్న వారి మనస్థితి పై జాలేస్తుంది’ అని జానీ మాస్టర్ ఎక్స్ లోనూ పేర్కొన్నారు.

Also Read: తెలంగాణలో కేసీఆర్‌కు జరిగినట్లే ఏపీలో జగన్‌కు జరుగుతుంది- ఏపీ ఎన్నికల ఫలితాలపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

ట్రెండింగ్ వార్తలు