ఇది ఆహారం కాదు కాలకూట విషం..! ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న రెస్టారెంట్లు, హోటళ్లు

గడిచిన నెల రోజులుగా హైదరాబాద్ లో హోటల్స్ లో వరుసగా అధికారులు చేస్తున్న తనిఖీల్లో దిమ్మతిరిగిపోయే దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.

Street Food : టైమ్ లేదని ఫుడ్ ఆర్డర్ ఇస్తున్నారా? ఆకలి దంచేస్తోందని హోటల్ కి వెళ్దామని అనుకుంటున్నారా? ఫ్యామిలీతో కలిసి వీకెండ్ కి పెద్ద రెస్టారెంట్ కి వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే ఒక్క నిమిషం ఆలోచన చేయాల్సిందే. ఆరోగ్యం కోసం తినాలని అనుకుంటున్నారో లేక రోగాలను కొని తెచ్చుకోవడానికి వెళ్లాలి అని అనుకుంటున్నారో తేల్చుకోండి.

ఈ మాట.. సాక్ష్యాత్తు ఫుడ్ సేఫ్టీ అధికారుల బిగ్ అలర్ట్ ఇది. గడిచిన నెల రోజులుగా హైదరాబాద్ లో హోటల్స్ లో వరుసగా అధికారులు చేస్తున్న తనిఖీల్లో దిమ్మతిరిగిపోయే దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. పరుగులు పట్టి పాడైపోయి కుళ్లిపోయి గడువు దాటిపోయిన ఆహార పదార్ధాలు ఒకవైపు.. ఏ మాత్రం శుభ్రత లేని కిచెన్ మరోవైపు.. తనిఖీకి వెళ్లిన అధికారులకు సైతం వాంతి తెచ్చేలా ఉన్నాయి.

Also Read : వీడియో రిలీజ్ చేసి అందరినీ తప్పుదోవ పట్టించిన హేమ!

 

ట్రెండింగ్ వార్తలు