Nithin 32 : ఒకేసారి నితిన్ 32వ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్ అనౌన్స్..

నితిన్ 32వ సినిమా నుంచి నితిన్ ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ సినిమాకు 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' అనే వెరైటీ టైటిల్ పెట్టారు. అలాగే సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు.

Nithin First Look and Title and Releasing Date Released from Nithin 32 Movie

Nithin 32 : వరుసగా హిట్స్ తో ఫామ్ లో ఉన్న నితిన్ కి ఇటీవల ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా బ్రేక్ వేసింది. ఆ సినిమా ఆశించినంత ఫలితం ఇవ్వలేదు. ప్రస్తుతం నితిన్ తన 32వ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌ గా శ్రీలీల నటించనుంది. నితిన్ తన సొంత బ్యానర్ శ్రేష్ఠ మూవీస్ లో ఈ సినిమా చేయనున్నాడు. ప్రముఖ రైటర్ వక్కంతం వంశీ ఈ సినిమాని తెరకెక్కించనున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతుంది. తాజాగా ఈ సినిమా నుంచి అప్డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. నితిన్ 32వ సినిమా నుంచి నితిన్ ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ సినిమాకు ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ అనే వెరైటీ టైటిల్ పెట్టారు. అలాగే సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. డిసెంబర్ 23న ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. ఒకే సారి ఫస్ట్ లుక్, టైటిల్, రిలీజ్ డేట్ ప్రకటించడంతో అభిమానులు సంతోషిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు