NTR30: యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న NTR30 మూవీ ఎప్పుడెప్పుడు రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేసినా, ఇంకా రెగ్యులర్ షూటింగ్ మాత్రం మొదలుపెట్టలేదు. దీంతో ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా చూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా వారు ఫాలో అవుతున్నారు.
NTR30: తారక్ కోసం బరిలోకి దిగుతున్న బాలీవుడ్ విలన్..?
అయితే ఈ సినిమా కోసం తారక్ మరోసారి మేకోవర్ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కోసం ఆయన బరువు తగ్గుతున్నాడు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా వినిపిస్తోంది. ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్‌ను తీసుకొచ్చేలా దర్శకుడు కొరటాల ప్లాన్ చేస్తున్నాడట. ఈ క్రమంలోనే బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్‌ను ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటింపజేయాలని కొరటాల తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడట.
NTR30: తారక్ వేలిపై కొత్త బజ్.. ఎక్స్ట్రా ఉండటమే మంచిదట..?
కానీ, ఈ సినిమాలో అమితాబ్ నటిస్తాడా లేడా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఇక గతంలో బిగ్ బి అమితాబ్, మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’లో ఓ కీలక పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరికొత్త లుక్‌తో కనిపించనుండగా, ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.