Omicron Scare : ఇండియాలోకి ఒమిక్రాన్.. భయం వద్దు.. జాగ్రత్తలు మరువద్దు!

దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన వేరియంట్ ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ భారత్‌లోకి ప్రవేశించింది. కర్నాటకలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.

Omicron Scare : దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన వేరియంట్ ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. ఇతర దేశాలను వణికిస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్ భారత్‌లోకి ప్రవేశించింది. ఇప్పటికే కర్నాటకలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారికంగా ప్రకటించింది. 46ఏళ్లు, 66 ఏళ్లు వయస్సు ఉన్న వ్యక్తులకు ఈ వేరియంట్ సోకిందని తెలిపింది. ఇటీవలే విదేశాల నుంచి బెంగళూరుకు వచ్చారని, ప్రైమరీ కాంటాక్ట్స్ క్వారంటైన్‌కు తరలించినట్టు తెలిపింది. ఇండియాలో ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తిపై కేంద్ర వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది.

ఒమిక్రాన్ గురించి ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. ప్రతి ఒక్కరూ మునపటిలానే కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించింది. ఎప్పటిలానే మాస్కులతో పాటు సామాజిక దూరాన్ని పాటించాలని సూచనలు చేసింది. చేతులను శుభ్రంగా కడుక్కోవాలని సూచించింది. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం 37 ల్యాబరేటరీలు ఏర్పాటు చేసినట్టు తెలిపింది. ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరూ తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలని సూచించింది.

టెస్టుల్లో ఎవరికైనా పాజిటివ్ నిరార్థణ అయితే వారికి వెంటనే చికిత్సకు ఏర్పాట్లు చేస్తామని పేర్కొంది. కర్ణాటకలో నమోదైన రెండు ఒమిక్రాన్ కేసుల్లో తీవ్ర లక్షణాలు కనిపించలేదని తెలిపింది. వారితో కలిసివారి కాంటాక్టులను గుర్తించే దిశగా చర్యలు చేపట్టినట్టు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

ఒమిక్రాన్ లక్షణాలు
– విపరీతమైన అలసట
– తేలికపాటి కండరాల నొప్పులు
– గొంతులో గరగర
– పొడి దగ్గు
– కొంతమందిలో మాత్రమే జ్వరం
– చికెన్‌ గున్యా‌కు, ఒమిక్రాన్‌కు చాలా వరకు ఒకే లక్షణాలు

Read Also : India Omicron : భారత్‌‌లోకి ఒమిక్రాన్ ఎంట్రీ..కర్నాటకలో రెండు కేసులు

ట్రెండింగ్ వార్తలు