Oppo Reno 8 Pro Sale : ఒప్పో రెనో 8 ప్రో 5G ఫోన్ స్పెషల్ ఎడిషన్ సేల్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?

Oppo Reno 8 Pro Sale : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో (Oppo), వార్నర్ బ్రదర్స్ సహకారంతో (Reno 8 Pro 5G) స్పెషల్ ఎడిషన్‌ను రిలీజ్ చేసింది. ఈ లిమిట్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ టీవీ సిరీస్ 'House of the Dragon edition' ఆధారంగా రూపొందించారు.

Oppo Reno 8 Pro Sale : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో (Oppo), వార్నర్ బ్రదర్స్ సహకారంతో (Reno 8 Pro 5G) స్పెషల్ ఎడిషన్‌ను రిలీజ్ చేసింది. ఈ లిమిట్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ టీవీ సిరీస్ ‘House of the Dragon edition’ ఆధారంగా రూపొందించారు. రెనో 8 ప్రో ఫోన్ డ్రాగన్ లిమిటెడ్ ఎడిషన్‌తో వస్తుంది. ఇందులో ప్రత్యేకంగా ఫోన్ కేస్, కీచైన్, సిమ్, ఫోన్ హోల్డర్ ప్రత్యేకంగా సేకరించిన డ్రాగన్ గుడ్డు ఉన్నాయి. ఆసక్తి కలిగిన కస్టమర్‌లు ఒక మెసేజ్‌తో కూడిన ప్రత్యేకమైన స్క్రోల్‌ను కూడా పొందవచ్చు.

ఈ స్పెషల్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) రూ. 45,999 ధరకు అందుబాటులో ఉండనుంది. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల పరంగా చూస్తే.. Reno 8 Pro ఫోన్ డ్రాగన్ లిమిటెడ్ ఎడిషన్ 6.7-అంగుళాల FHD AMOLED డిస్‌ప్లేను 120 Hz రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది. అంతేకాకుండా, డిస్ప్లే HDR10+కి కూడా సపోర్ట్ అందిస్తుంది. ఈ డివైజ్ MediaTek డైమెన్సిటీ 8100 Max SoC ద్వారా ఆధారితమైనది. ఈ స్మార్ట్‌ఫోన్ 12GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్‌తో వస్తుంది.

Read Also : Oppo Inno Day 2022 : ఒప్పో ఫైండ్ N2 ఫోల్డబుల్ ఫోన్ వస్తోంది.. లాంచ్ డేట్ ఎప్పుడు? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

ఆండ్రాయిడ్ 12-ఆధారిత ColorOS 12.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. అదనంగా, రెనో 7 సిరీస్‌తో పోలిస్తే.. రెనో 8 సిరీస్ (Reno 8 Series) 2.2x స్టీమ్ కూల్ రూంను కలిగి ఉంది. కెమెరాల విషయానికి వస్తే.. Oppo నుంచి హ్యాండ్‌సెట్ 50MP సోనీ IMX766 ప్రైమరీ సెన్సార్, 8MP IMX355 అల్ట్రావైడ్ కెమెరా సెన్సార్, 2MP మాక్రో సెన్సార్‌తో వస్తుంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం.. స్మార్ట్‌ఫోన్‌లో 32MP సోనీ IMX709 సెన్సార్ ఉంది.

Oppo Reno 8 Pro House of the Dragon edition goes on sale 

ఆసక్తికరంగా, Oppo డివైజ్.. MariSilicon X NOUతో వస్తుంది. సంస్థ ఇంటర్నల్ NPU తక్కువ-కాంతి 4K వీడియో క్వాలిటీని అందించనుంది. 4K HDR వీడియో రికార్డింగ్‌తో వస్తుందని పేర్కొంది. Oppo Reno ఫోన్‌లో 8 Pro 80W SuperVOOC ఛార్జింగ్‌కు సపోర్టుతో 4500mAh బ్యాటరీని కలిగి ఉంది. కంపెనీ ప్రకారం.. SuperVOOC ఛార్జర్ కేవలం 11 నిమిషాల్లో 50 శాతం బ్యాటరీని ఛార్జ్ చేయవచ్చు. అంతేకాకుండా, హ్యాండ్‌సెట్ సెక్యూరిటీ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్‌తో వస్తుంది. కనెక్టివిటీ కోసం 5G, బ్లూటూత్, GPSలకు సపోర్టు ఇస్తుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారంగా ColorOS 12.1 కస్టమ్ స్కిన్‌పై స్మార్ట్‌ఫోన్ రన్ అవుతుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Oppo Find N2 : ఒప్పో నుంచి కొత్త ఫోల్డబుల్ ఫోన్‌ వస్తోంది.. లాంచ్‌కు ముందే ఫైండ్ N2 ఫోన్ ఫీచర్లు లీక్..!

ట్రెండింగ్ వార్తలు