Oscars 2023 : ఆస్కార్ .. ఎప్పుడు? ఎక్కడ? ఎందులో చూడొచ్చు?

95వ ఆస్కార్ వేడుకలు అమెరికా టైం ప్రకారం మార్చ్ 12న రాత్రి 8 గంటలకు జరగనున్నాయి. మన ఇండియన్ టైం ప్రకారం మార్చ్ 13న ఉదయం 5 గంటల 30 నిమిషాలకు ప్రారంభం కానున్నాయి. లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్.....................

Oscars 2023 :  మరికొద్ది గంటల్లో ఆస్కార్ వేడుక జరగబోతుంది. ప్రపంచ సినీ ప్రేమికులంతా ఈ అవార్డు వేడుకల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సంవత్సరం భారతదేశం నుంచి బెస్ట్ సాంగ్ ఒరిజినల్ విభాగంలో RRR సినిమా నాటు నాటు సాంగ్ నిలవడంతో భారతీయులకు ఈ ఆస్కార్ వేడుక మరింత ఆసక్తిగా ఉంది. దీనితో పాటు డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ది ఎలిఫెంట్ విస్పరర్స్, డాక్యుమెంటరీ ఫ్యూచర్ ఫిల్మ్ విభాగంలో అల్ ది బ్రీత్స్ సినిమాలు కూడా ఇండియా నుంచి నామినేషన్స్ లో నిలిచాయి. ఈ మూడు కూడా ఆస్కార్ అవార్డులు సాధించాలని భారతీయులంతా కోరుకుంటున్నారు. అయితే చాలా మందికి ఈ అవార్డు వేడుకలు ఇండియాలో ఏ టైంకి టెలికాస్ట్ అవుతాయి, దేంట్లో లైవ్ చూడాలి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

95వ ఆస్కార్ వేడుకలు అమెరికా టైం ప్రకారం మార్చ్ 12న రాత్రి 8 గంటలకు జరగనున్నాయి. మన ఇండియన్ టైం ప్రకారం మార్చ్ 13న ఉదయం 5 గంటల 30 నిమిషాలకు ప్రారంభం కానున్నాయి. లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ ఆస్కార్ వేడుకలకు వేదిక కానుంది. అమెరికన్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ ABC ఈ వేడుకల్ని తమ ప్లాట్ ఫామ్స్ లో లైవ్ స్ట్రీమింగ్ చేయనుంది. ABC యూట్యూబ్ ఛానల్ తో పాటు వాటి సోషల్ మీడియాలో కూడా లైవ్ లో చూడొచ్చు. అలాగే ఈ సారి ఆస్కార్ వేడుకలు డిస్నీప్లస్ హాట్ స్టార్, హులు ఓటీటీలు కూడా స్ట్రీమింగ్ చేయనుంది. అలాగే అమెరికాలోని కొన్ని టీవీ ఛానల్స్ లో కూడా లైవ్ స్ట్రీమింగ్ అవ్వనుంది. అలాగే మన 10tv సైట్ లో లైవ్ అప్డేట్స్ కూడా చూడొచ్చు.

Oscars 2023 : ఆస్కార్ లో ఈ సంవత్సరం అత్యధిక నామినేషన్స్ దక్కించుకున్న సినిమాలు ఇవే..

95వ ఆస్కార్ వేడుకలకు హోస్ట్ గా ప్రముఖ అమెరికన్ నటుడు, యాంకర్ జిమ్మీ కిమేల్ వ్యవహరించనున్నాడు. జిమ్మీ కిమేల్ గతంలో రెండు సార్లు ఆస్కార్ వేడుకలకు హోస్ట్ గా చేశాడు. 2017, 2018 ఆస్కార్ వేడుకల్ని జిమ్మీ కిమేల్ హోస్ట్ చేశాడు. ఇప్పుడు మూడో సారి హోస్ట్ చేయబోతున్నాడు.

ట్రెండింగ్ వార్తలు