Shivmogga Airport: శివమొగ్గ ఎయిర్‭పోర్ట్ ప్రారంభించిన ప్రధాని మోదీ

తాజా ఎయిర్‭పోర్ట్‭తో కర్ణాటక రాష్ట్రంలో తొమ్మిది ఎయిర్‭పోర్ట్‭లు అయ్యాయి. బెంగళూరు, బళ్లారి, బెళగావి, కలబురిగి, మైసూరు, మంగళూరు (బెంగళూరు, మంగళూరు నగరాల్లో రెండు ఎయిర్‭పోర్టులు ఉన్నాయి)ల సరసన ఇప్పుడు తాజా ఎయిర్‭పోర్ట్ చేరింది. ఇక రాష్ట్ర రాజధానిలోని బెంగళూరులో ఉన్న కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం తర్వాత అతిపెద్ద రన్ వే ఉన్న విమానాశ్రయం ఇదే.

Shivmogga Airport: ఈ యేడాది చివర్లో ఎన్నికలు జరగనున్న కర్ణాటక రాష్ట్రంలో ఉన్న శివమొగ్గ ఎయిర్‭పోర్ట్‭ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం ప్రారంభించారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసరాజు బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సహా బీజేపీ పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఎయిర్‭పోర్ట్ మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప కలల ప్రాజెక్ట్. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఎయిర్‭పోర్ట్ నిర్మాణానికి నిధులు తీసుకొచ్చినట్లు బీజేపీ వర్గాలు చెబుతుంటాయి.

Shashi Tharoor: శశి థరూర్ సభకు డిక్షనరీతో వచ్చిన ఓ వ్యక్తి.. తప్పేం లేదంటున్న నెటిజెన్లు

ఇక శివమొగ్గ ఎయిర్‭పోర్ట్ నిర్మాణానికి ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) పథకం కింద కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఎయిర్‭పోర్ట్‭కు కర్ణాటక కవి, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత కువెంపు పేరు పెట్టారు. ఈ విమానాశ్రయం గంటకు 300 మంది ప్రయాణికులను చేరవేస్తుందని తెలిపారు. శివమొగ్గ విమానాశ్రయాన్ని దాదాపు రూ. 449 కోట్లతో నిర్మించారు. విమానాశ్రయంలోని ప్యాసింజర్ టెర్మినల్ భవనం రోజుకు 7,200 మంది ప్రయాణీకులను నిర్వహిస్తుందని అధికారులు తెలిపారు.

Uttar Pradesh: ఉమేశ్ పాల్ హత్య కేసులో నిందితుడు ఎన్‭కౌంటర్‭లో హతం

కాగా, తాజా ఎయిర్‭పోర్ట్‭తో కర్ణాటక రాష్ట్రంలో తొమ్మిది ఎయిర్‭పోర్ట్‭లు అయ్యాయి. బెంగళూరు, బళ్లారి, బెళగావి, కలబురిగి, మైసూరు, మంగళూరు (బెంగళూరు, మంగళూరు నగరాల్లో రెండు ఎయిర్‭పోర్టులు ఉన్నాయి)ల సరసన ఇప్పుడు తాజా ఎయిర్‭పోర్ట్ చేరింది. ఇక రాష్ట్ర రాజధానిలోని బెంగళూరులో ఉన్న కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం తర్వాత అతిపెద్ద రన్ వే ఉన్న విమానాశ్రయం ఇదే. మరో విశేషం ఏంటంటే, యడియూరప్ప పుట్టినరోజు అయిన ఈరోజే ఈ ఎయిర్‭పోర్ట్‭ను ప్రారంభించారు. ఈ సందర్భంగా యడియూరప్పకు మోదీ అభినందనలు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు