Special car for PM Modi: ప్రధాని మోదీ రూ.12 కోట్ల విలువైన కారు ప్రత్యేకతలు ఇవే!

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థను నడిపిస్తున్న భారత ప్రధాని వ్యక్తిగత రక్షణ నిమిత్తం, అత్యంత శక్తివంతమైన, భారీ భద్రతతో కూడిన వాహనాన్ని భద్రతాధికారులు తీసుకువచ్చారు.

Special car for PM Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక పర్యటనల కోసం వినియోగించే వాహనశ్రేణిలో మరో శక్తివంతమైన వాహనం వచ్చి చేరింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థను నడిపిస్తున్న భారత ప్రధాని వ్యక్తిగత రక్షణ నిమిత్తం, అత్యంత శక్తివంతమైన, భారీ భద్రతతో కూడిన వాహనాన్ని భద్రతాధికారులు తీసుకువచ్చారు. సుమారు రూ.12 కోట్ల విలువ గల ఈ మెర్సిడెస్-బెంజ్ “మేబ్యాక్ S650 గార్డ్” కారును బుల్లెట్ దాడులు, రాకెట్ లాంచ్ వంటి భారీ పేలుళ్లను కూడా తట్టుకునేలా లేటెస్ట్ టెక్నాలజీతో తీర్చిదిద్దారు. భారత్ లో రాష్ట్రపతి వంటి వీవీఐపీలకు మాత్రమే అందించే ఎస్పీజీ(SPG) సెక్యూరిటీలో భాగంగా ఈ కారును ప్రధాని మోదీ కాన్వాయ్ లో చేర్చారు అధికారులు. మరి రూ.12 కోట్ల విలువైన మెర్సిడెస్-బెంజ్ “మేబ్యాక్ S650 గార్డ్” విశేషాలేంటో మీరే చూడండి.

కారు ప్రత్యేకతలు:

ఈ కారు ఇంజిన్ విషయానికి వస్తే 6 లీటర్ల సామర్ధ్యంతో V12 ట్విన్ టర్బోఛార్జ్డ్ ఇంజిన్ కలిగి ఉంది. ఈకారు 516 BHP పవర్ ను, 900 NM టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. గంటకు గరిష్టంగా 160 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణించేలా కారులో మార్పులు చేర్పులు చేసారు. ఈ S650 కారులో ప్రపంచంలోనే సమర్థవంతమైన భద్రతకు ప్రామాణికంగా తీసుకునే “VR10” రక్షణ వ్యవస్థను అమర్చారు. ఏకే47, TNT పేలుళ్లు, గ్యాస్ ఆధారిత పేలుళ్లను కూడా తట్టుకునేలా “VR10” రక్షణ వ్యవస్థ పనిచేస్తుంది. అందుకోసం కారులోని బయటి, లోపలి పొరల మధ్య భాగంలో ప్రత్యేకంగా తయారు చేసిన స్టీల్ పొరను ఏర్పాటు చేశారు. శత్రుమూకల దాడులను పూర్తిగా తట్టుకునేలా 2010 రేటింగ్ తో కూడిన పేలుడు నిరోధక వాహనం (ERV) రక్షణ వ్యవస్థ కలిగి ఉంది ఈ కారు.

Also Read: Viral Video: ఎవరూ లేరనుకుని డాన్స్ ఇరగదీసింది: సూపర్ వైరల్ అయింది

అంతేకాదు, ఈ “మేబ్యాక్ S650 గార్డ్” కారు టైర్లు సైతం ప్రత్యేకత కలిగి ఉన్నాయి. తూటాలు తగిలినా పంక్చర్ కానటువంటి అత్యంత శక్తివంతమైన టైర్లు ఈకారుకి అమర్చారు. బుల్లెట్లు తగిలినా దానంతట అదే రంధ్రాలను సరిదిద్దుకునేలా ఇంధన ట్యాంకును తయారు చేశారు. అందుకోసం ప్రత్యేక మెటీరియల్ ను ట్యాంకు తయారీలో ఉపయోగించారు. ఇన్ని ప్రత్యేకతలతో కూడిన ఈ మెర్సిడెస్-బెంజ్ “మేబ్యాక్ S650 గార్డ్”ను ఇటీవలే ప్రధాని మోదీ కాన్వాయ్ లో చేర్చారు భద్రతాధికారులు. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన సందర్భంగా నిర్వహించిన సమావేశానికి.. మోదీ ఈ కారులోనే హాజరయ్యారు. అంతకముందు దేశీయంగా తయారైన మహీంద్రా స్కార్పియో, రేంజ్ రోవర్, ల్యాండ్ క్రూయిజర్, BMW వంటి కార్లను ప్రధాని మోదీ తన అధికారిక పర్యటనల కోసం వినియోగించారు.

Also Read: Pushpa Thank You Meet : కంటతడి పెట్టించిన సుకుమార్.. లైట్ అండ్ సెట్ బాయ్స్‌కి లక్ష రూపాయలు ప్రకటన..

ట్రెండింగ్ వార్తలు