Pooja Hegde: మళ్లీ పాత బిరుదునే తగిలించుకుంటున్న బుట్టబొమ్మ..!

అందాల భామ పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా తనదైన స్టార్‌డమ్‌తో దూసుకుపోతుంది. ఇప్పటికే యంగ్ హీరోలందరితో సినిమాలు చేసిన ఈ బ్యూటీ, అటు మిగతా భాషల్లోనూ తన సత్తా చాటుతోంది. తమిళ, హిందీ భాషల్లో పూజా వరుసగా సినిమాలు చేస్తోంది. అయితే కెరీర్ తొలినాళ్లలో ఈ బ్యూటీకి ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది. బాలీవుడ్‌లో ‘మొహెంజొదారో’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పూజా, తెలుగులోనూ సరైన విజయాన్ని అందుకోలేదు.

Pooja Hegde: అందాల భామ పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా తనదైన స్టార్‌డమ్‌తో దూసుకుపోతుంది. ఇప్పటికే యంగ్ హీరోలందరితో సినిమాలు చేసిన ఈ బ్యూటీ, అటు మిగతా భాషల్లోనూ తన సత్తా చాటుతోంది. తమిళ, హిందీ భాషల్లో పూజా వరుసగా సినిమాలు చేస్తోంది. అయితే కెరీర్ తొలినాళ్లలో ఈ బ్యూటీకి ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది. బాలీవుడ్‌లో ‘మొహెంజొదారో’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పూజా, తెలుగులోనూ సరైన విజయాన్ని అందుకోలేదు.

Pooja Hegde: నేను దానికోసమే ఇండస్ట్రీలోకి రాలేదు.. పూజా హాట్ కామెంట్స్!

ఆమె చేసిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ సక్సెస్‌ను అందుకోలేకపోయాయి. దీంతో అమ్మడి కెరీర్ స్టార్టింగ్‌లోనే ముగిసిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన ‘డీజే దువ్వాడ జగన్నాథం’ సినిమాలో నటించి తొలి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది పూజా. ఇక ఆ తరువాత వరుసగా సక్సెస్‌ను అందుకుంటూ టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ క్రమంలోనే తమిళంలో ‘బీస్ట్’ సినిమాతో ఎంట్రీ ఇవ్వగా, బాలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.

Pooja Hegde: పూజా ఫిక్స్ అయ్యింది.. మహేష్ అండ్ కో కోసమే వెయిటింగ్!

అయితే ఈ ఏడాదిలో పూజా చేసిన ఒక్క సినిమా కూడా హిట్ కాకపోవడం గమానర్హం. ప్రభాస్‌తో ‘రాధేశ్యామ్’, విజయ్‌తో ‘బీస్ట్’, మెగా పవర్ స్టార్ చరణ్ సరసన ‘ఆచార్య’, తాజాగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి డైరెక్షన్‌లో ‘సర్కస్’ లాంటి ప్రెస్టీజియస్ చిత్రాల్లో పూజా నటించింది. ఈ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో తనకు గుర్తింపును తీసుకొస్తాయని పూజా భావించింది. కానీ ఈ సినిమాలన్నీ కూడా డిజాస్టర్స్‌గా నిలవడంతో ఇప్పుడు మళ్లీ పూజాను ఐరన్ లెగ్ అని పలువురు క్రిటిక్స్ అంటున్నారు. మరి ఈ బిరుదును తొలగించుకునేందుకు పూజా మరోసారి సక్సెస్‌ను ఏ సినిమాతో అందుకుంటుందో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు