Jayaram : కరోనా బారిన పడిన ప్రముఖ నటుడు జయరామ్..

‘అల.. వైకుంఠపురములో’, ‘రాధే శ్యామ్’ సినిమాల్లో నటించిన పాపులర్ నటుడు జయరామ్‌కి కోవిడ్ పాజిటివ్..

Jayaram: ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌తో కరోనా మహమ్మారి సృష్టించిన విధ్వంసం గురించి పూర్తిగా మర్చిపోకముందే ఇప్పుడు థర్డ్ వేవ్ ప్రపంచాన్ని వణికించేస్తోంది. వైరస్‌కి సామాన్యులు, సెలబ్రిటీ అనే తేడా తెలియదు కదా.. సో, ఇప్పటికే ఎంతోమంది థర్డ్ వేవ్‌లో కరోనా బారినపడ్డారు.

Priyanka Jawalkar : ‘టాక్సీవాలా’ హీరోయిన్‌కి కోవిడ్..

ఇటీవల మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, ఆయన తనయుడు దుల్కర్ సల్మాన్, మలయాళీ యాక్ట్రెస్ అన్నా బెన్ తమకు కోవిడ్ సోకినట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. తెలుగు యాక్ట్రెస్, ‘టాక్సీవాలా’ ఫేం ప్రియాంక జవాల్కర్‌కి కూడా కోవిడ్ వచ్చింది. ఈ విషయం మర్చిపోకముందే మరో నటుడు కరోనా బారిన పడ్డారు.

Mammootty : మలయాళం స్టార్ హీరో మమ్ముట్టికి కరోనా

పాపులర్ మలయాళ నటుడు, ‘అల.. వైకుంఠపురములో’ ఫేం జయరామ్ సుబ్రమనియమ్ కరోనా బారిన పడ్డారు. ఆయనకు జరిపిన టెస్టుల్లో పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని జయరామ్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. వైరస్ ఇంకా మన మధ్యే ఉందని చెప్పడానికి ఇదే గుర్తు అన్నారు.

Anna Ben : పాపులర్ నటికి కరోనా..

తనతో సన్నిహితంగా ఉన్న అందరూ ఐసోలేట్ కావాలన్నారు. లక్షణాలు కనిపిస్తే టెస్ట్ చేయించుకోవాలని కోరారు. కరోనా లక్షణాలు కనిపించడం వల్లే తాను టెస్ట్ చేయించుకున్నానని.. ట్రీట్‌మెంట్ కూడా తీసుకుంటున్నానని చెప్పారు. అతి త్వరలోనే అందరినీ మళ్లీ కలుస్తానని తన పోస్ట్‌లో పేర్కొన్నారు జయరామ్. ప్రభాస్ ‘రాధే శ్యామ్’ లోనూ ఆయన కీలకపాత్రలో నటించారు.

ట్రెండింగ్ వార్తలు