Love Mocktail 2 : ‘లవ్ మాక్‌టైల్ 2’ సినిమా రివ్యూ.. ఎమోషనల్ కథాంశంతో..

లవ్ మాక్‌టైల్ కి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా కూడా కన్నడలో భారీ విజయం సాధించగా ఇప్పుడు తెలుగులోకి వచ్చింది.

Darling Krishna Milana Nagaraj Rachel David Love Mocktail 2 Movie Review and Rating

Love Mocktail 2 Movie Review : కన్నడలో సూపర్ హిట్ అయిన ‘లవ్ మాక్‌టైల్ 2’ సినిమా నేడు జూన్ 14న తెలుగులో గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ చేశారు. డార్లింగ్ కృష్ణ, రాచెల్ డేవిడ్, మిలనా నాగరాజ్, రచన, అమృత.. పలువురు ముఖ్య పాత్రల్లో డార్లింగ్ కృష్ణ దర్శకత్వంలో ఈ ‘లవ్ మాక్‌టైల్ 2’ సినిమా తెరకెక్కింది. కన్నడ సూపర్ హిట్ సినిమా లవ్ మాక్‌టైల్ కి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా కూడా కన్నడలో భారీ విజయం సాధించగా ఇప్పుడు తెలుగులోకి వచ్చింది. ఈ సినిమాని తెలుగులో కంచి కామాక్షి కోల్కతా కాళీ క్రియేషన్స్ బ్యానర్ పై MVR కృష్ణ రిలీజ్ చేస్తున్నారు.

కథ విషయానికొస్తే.. లవ్ మాక్‌టైల్ సినిమాకి కంటిన్యూగానే సాగుతుంది పార్ట్ 2. ఆది(డార్లింగ్ కృష్ణ) భార్య నిధి(మిలినా నాగరాజ్) చనిపోయిన తర్వాత భార్య జ్ఞాపకాలతో బతుకుతున్న ఆదిని ఆ డిప్రెషన్ నుంచి బయటకు తీసుకురావాలనుకుంటారు ఫ్రెండ్స్. ఈ క్రమంలో ఆది తన భార్య జ్ఞాపకాల నుంచి బయటకు రావాలనుకొని అరకు ట్రావెల్ చేస్తాడు. అయినా ఈ ప్రయాణంలో కూడా తన భార్య తన పక్కనే ఉందని ఊహించుకుంటూ ఉంటాడు. ఆది అంటే ఇష్టం ఉందని కొంతమంది అమ్మాయిలు వచ్చినా పట్టించుకోడు. తను ఊహించుకున్న భార్యే తనని పెళ్లి చేసుకొమ్మని చెప్పడంతో ఆది ఇంకో పెళ్ళికి సిద్దమవుతాడు. మరి ఆది పెళ్లి చేసుకున్నాడా లేదా? ఆదిని పెళ్లి చేసుకోవాలని వెంట పడ్డ అమ్మాయి ఎవరు? ఆది ఫ్రెండ్స్ ఏం చేశారు అనేది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

సినిమా విశ్లేషణ.. లవ్ మాక్‌టైల్ మొదటి పార్ట్ ట్రాజెడీగా ముగుస్తుంది. అదే ట్రాజెడీతో ఈ సెకండ్ పార్ట్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ లో కొంచెం సాగదీత అనిపించినా కామెడీ అక్కడక్కడా వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషన్స్ తోనే సాగుతుంది. క్లైమాక్స్ కూడా మంచి ఎమోషన్ తోనే ముగిస్తారు. ఫస్ట్ హాఫ్ లో ప్రేమని ఎంత బాగా చూపించారో ఇందులో కూడా ప్రేమ, పెళ్లి బంధాల గురించి గొప్పగానే చూపించారు.

Also Read : Harom Hara Review : ‘హరోం హర’ మూవీ రివ్యూ.. సుధీర్ బాబు హిట్ కొట్టాడా?

నటీనటుల పర్ఫార్మెన్స్.. లవ్ మాక్‌టైల్ తో ప్రేక్షకులని మెప్పించిన డార్లింగ్ కృష్ణ మరోసారి తన సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులకు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాడు. ఓ పక్క డైరెక్షన్ చేస్తూనే మరో పక్క హీరోగా నటించి మెప్పించాడు. నిధి పాత్రలో మిలినా నాగరాజ్ బాగానే చేసింది. రచల్ డేవిడ్ కూడా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. నకుల్ అభయాన్కర్, అమృత అయ్యంగర్, సుస్మిత గౌడ, అభిలాష్.. ఇలా మిగిలిన నటీనటులు కూడా పర్వాలేదనిపించారు.

సాంకేతిక అంశాలు.. ఈ కన్నడ సినిమాని తెలుగులో డబ్బింగ్ బాగా చేయించారు. సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా అందంగా ఉంటాయి. సాంగ్స్ ఒకసారి వినడానికి బాగుంటాయి, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఎమోషనల్ సీన్స్ లో అదిరిపోతుంది. ఒక ఎమోషనల్ కథ, కథనంతో డైరెక్టర్ డార్లింగ్ కృష్ణ మరోసారి ప్రేక్షకులని మెప్పించి సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు.

మొత్తంగా లవ్ మాక్‌టైల్ 2 సినిమా భార్య చనిపోతే భర్త ఆ జ్ఞాపకాల నుంచి ఎలా బయటకి వచ్చాడు అని ఎమోషనల్ గా చూపించి మెప్పించారు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

ట్రెండింగ్ వార్తలు