Raviteja : రవితేజ మెడకు ఏమైంది..? తీవ్రమైన నొప్పితో షూటింగ్.. హరీష్ శంకర్ పోస్ట్ వైరల్..

తాజాగా రవితేజపై హరీష్ శంకర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

Raviteja : మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం రవితేజ షూటింగ్ లో ఉన్నాడు. అయితే తాజాగా హరీష్ శంకర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

Also Read : Dear Nanna : నాన్న కొడుకుల ఎమోషనల్ సినిమా.. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న డియర్ నాన్న

హరీష్ శంకర్ తాజాగా ఓ ఆసక్తికర ఫోటో షేర్ చేసాడు. ఈ ఫొటోలో.. రవితేజ మెడ నొప్పి తగ్గడానికి మెడ మీద బ్యాండ్ పెట్టుకొని కూర్చోగా హరీష్ శంకర్ పక్కనే అది పట్టుకొని కూర్చున్నాడు. ఈ ఫోటో షేర్ చేస్తూ.. మాస్ మహారాజ రవితేజ డెడికేషన్ కి హ్యాట్స్ ఆఫ్. తీవ్రమైన మెడ నొప్పితో బాధపడుతున్నా షూటింగ్ చేస్తున్నారు. థ్యాంక్యూ అన్నయ్య. ప్రతి రోజు మమ్మల్ని ఇన్‌స్పైర్ చేస్తావు అని పోస్ట్ చేసాడు.

దీంతో హరీష్ శంకర్ పోస్ట్ వైరల్ గా మారింది. రవితేజ మెడకు ఏమైంది? రవితేజ మెడ నొప్పికి కారణమేంటి అంటూ కొంతమంది అభిమానులు అడుగుతుండగా మరి కొంతమంది తీవ్రమైన నొప్పి ఉన్నప్పుడు రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటుంటే, ఇంకొందరు రవితేజ డెడికేషన్ కి హ్యాట్స్ ఆఫ్ అంటున్నారు. సినిమా కోసం రవితేజ ఎంతగా కష్టపడతారో అందరికి తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు