Saripodhaa Sanivaaram first song : నాని ‘సరిపోదా శనివారం’ నుంచి ఫ‌స్ట్ సింగిల్‌.. ‘గ‌రం గ‌రం యముడ‌యో..’

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా న‌టిస్తున్న చిత్రం ‘సరిపోదా శనివారం’.

Saripodhaa Sanivaaram : నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా న‌టిస్తున్న చిత్రం ‘సరిపోదా శనివారం’. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఎస్‌జే సూర్య కీల‌క పాత్ర‌తో న‌టిస్తున్న ఈ మూవీలో ప్రియాంక అరుళ్‌ మోహన్ హీరోయిన్‌. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి లు ఈ మూవీని నిర్మిస్తున్నారు. శ‌ర‌వేగంగా ఈ సినిమా షూటింగ్ జ‌రుపుకుంటోంది.

ఈ మూవీ నుంచి ఇప్ప‌టికే విడుద‌ల గ్లింప్స్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచేసింది. ఇక ఈ మూవీ ఆగ‌స్టు 29న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను మొద‌లు పెట్టింది. అందులో భాగంగా ఫ‌స్ట్ సాంగ్‌ను విడుద‌ల చేసింది. ‘గ‌రం గ‌రం యముడ‌యో.. సహనాల శివుడాయో.. నరం నరం బిగువయో..’ అంటూ ఈ పాట సాగుతోంది.

MR Bachchan : ర‌వితేజ ‘మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌’ నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌.. డైలాగ్‌లు లేకుండానే షో రీల్..

ఈ పాట విశాల్ ద‌ద్లానీ పాడారు. జేక్స్ బిజోయ్ సంగీతాన్ని అందించిన ఈ మాస్ బీట్ ఆక‌ట్టుకుంటోంది. ప్ర‌స్తుతం యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. ‘అంటే సుందరానికి’ మూవీ తర్వాత నాని – వివేక్ కాంబినేష‌న్‌లో ఈ సినిమా రానుండ‌డంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు