MR Bachchan : ర‌వితేజ ‘మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌’ నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌.. డైలాగ్‌లు లేకుండానే షో రీల్..

మాస్ మహారాజ రవితేజ న‌టిస్తున్న చిత్రం మిస్టర్ బచ్చన్.

MR Bachchan : ర‌వితేజ ‘మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌’ నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌.. డైలాగ్‌లు లేకుండానే షో రీల్..

Raviteja Mr Bachchan show reel on june 17th

Mr Bachchan show reel : మాస్ మహారాజ రవితేజ న‌టిస్తున్న చిత్రం మిస్టర్ బచ్చన్. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ మూవీ రైడ్‌కు రీమేక్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే క‌థ‌నాయిక‌. శ‌ర‌వేగంగా ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతోంది. మ‌రోవైపు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పనులు ప్రారంభ‌మ‌య్యాయి.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను చిత్ర బృందం విడుద‌ల చేసింది. ర‌వితేజ డైహార్డ్ ఫ్యాన్ ఒక‌రు షూటింగ్ సెట్ లో వ‌చ్చి డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్‌తో సినిమా అప్‌డేట్ గురించి అడిగిన‌ట్లుగా ఓ వీడియోను విడుద‌ల చేశారు. ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్‌, ట్రైల‌ర్‌ల‌కు ఇంకా టైమ్ ఉంద‌ని.. జూన్ 17న మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ షోరీల్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ద‌ర్శ‌కుడు చెప్పాడు. అయితే.. మాట‌లు లేకుండా దీన్ని రిలీజ్ చేయ‌నున్న‌ట్లు తెలిపాడు. మ‌రీ ఆ షో రీల్ ఎలా ఉంటుందోన‌ని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

Kalki AD 2898 : రెండు భాగాలుగా రానున్న ప్ర‌భాస్ క‌ల్కి మూవీ..?

ఈ మూవీకి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. జగపతిబాబు కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.