Kalki AD 2898 : రెండు భాగాలుగా రానున్న ప్ర‌భాస్ క‌ల్కి మూవీ..?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న మూవీ క‌ల్కి 2898AD.

Kalki AD 2898 : రెండు భాగాలుగా రానున్న ప్ర‌భాస్ క‌ల్కి మూవీ..?

IS Kalki 2898 AD Releasing In Two Parts

Kalki AD 2898 : పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న మూవీ క‌ల్కి 2898AD. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న మూవీ పై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. జూన్ 27న‌ ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉంది. ఇటీవ‌ల ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌గా అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా చిత్ర ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ ప‌లు ఇంట‌ర్వ్యూలో పాల్గొంటున్నాడు.

ఈ క్ర‌మంలో ఓ ఇంట‌ర్వ్యూలో నాగ్ అశ్విన్ మాట్లాడిన క్లిప్ ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. ప్ర‌స్తుతం పెద్ద సినిమాలు అన్ని దాదాపుగా రెండు భాగాలుగా వ‌స్తున్నాయి. కేజీఎఫ్‌, స‌లార్‌, పుష్ప‌, దేవ‌ర వంటి సినిమాలు రెండు భాగాలు తెర‌కెక్కాయి. ఇలానే క‌ల్కి సినిమాకు సీక్వెల్ ఉంటుందా..? అనే ప్ర‌శ్న ఎదురైంది.

Mahesh Babu – Charith Maanas : అందులో కూడా అచ్చం మేనమామలాగే.. వైరల్ అవుతున్న మహేష్ బాబు అల్లుడు..

అయితే.. స్వీకెల్ పై అశ్విన్ ఏటూ తేల్చ‌లేదు. సినిమా రెండు భాగాలుగా ఉంటుందా..? ఉండ‌దా..? అని చెప్ప‌డానికి అత‌డు ఇష్ట‌ప‌డ‌డం లేదు. కాగా.. ఈ మూవీ రెండు భాగాలుగా రానుంద‌ని కొన్ని రూమ‌ర్లు వ‌స్తున్నాయి. మ‌రి వీటిలో నిజం తెలియాలంటే జూన్ 27 వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.

కల్కి సినిమాలో ప్రభాస్ తో పాటు అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకోన్, దిశా పటాని.. ఇలా పలువురు స్టార్స్ న‌టిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వినీదత్ భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కాగా.. ఈ చిత్రంలోని తొలి పాటను నేడు విడుద‌ల చేయ‌నున్నారు.

Pawan Kalyan – Sreeleela : ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి వర్కింగ్ స్టిల్ షేర్ చేసిన డైరెక్టర్.. పవన్, శ్రీలీలతో హరీష్..