Mahesh Babu – Charith Maanas : అందులో కూడా అచ్చం మేనమామలాగే.. వైరల్ అవుతున్న మహేష్ బాబు అల్లుడు..

గత కొంతకాలంగా సుధీర్ బాబు పెద్ద తనయుడు చరిత్ మానస్ వైరల్ అవుతూనే ఉన్నాడు.

Mahesh Babu – Charith Maanas : అందులో కూడా అచ్చం మేనమామలాగే.. వైరల్ అవుతున్న మహేష్ బాబు అల్లుడు..

Mahesh Babu Son in Law Sudheer Babu Son Charith Maanas goes Viral

Updated On : June 14, 2024 / 8:25 PM IST

Mahesh Babu – Charith Maanas : హీరో సుధీర్ బాబు మహేష్ బాబు(Mahesh Babu) చెల్లి పద్మిని ప్రియదర్శిని(Padmini Priyadharshini)ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. అయితే గత కొంతకాలంగా సుధీర్ బాబు పెద్ద తనయుడు చరిత్ మానస్ వైరల్ అవుతూనే ఉన్నాడు.

చరిత్ అచ్చం మహేష్ బాబు లాగే కనపడటం, మహేష్ మేనరిజమ్స్ చరిత్ లో కనిపించడంతో ఇప్పటికే పలుమార్లు మేనమామ పోలికలు బాగా వచ్చాయి అని అనుకున్నారు. ఇక చరిత్ ఆల్రెడీ చైల్డ్ ఆర్టిస్ట్ గా గతంలో సుధీర్ బాబు సినిమాలోనే చేసాడు. మహేష్ ఫ్యాన్స్ కూడా చరిత్ ని చూస్తుంటే మహేష్ గుర్తుకు వస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై సుధీర్ బాబు కూడా మంచిదే కదా అని అన్నాడు కూడా.

Also Read : Pawan Kalyan – Sreeleela : ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి వర్కింగ్ స్టిల్ షేర్ చేసిన డైరెక్టర్.. పవన్, శ్రీలీలతో హరీష్..

ఇక చరిత్ భవిష్యత్తులో సినిమాల్లోకి కూడా రావొచ్చు అని సుధీర్ బాబు గతంలోనే తెలిపాడు. అయితే తాజాగా మరోసారి మహేష్ మేనల్లుడు చరిత్ వైరల్ అవుతున్నాడు. ఇవాళ సుధీర్ బాబు కొత్త సినిమా హరోం హర రిలీజయింది. ఈ సినిమాకి చూడటానికి చరిత్ తన ఫ్రెండ్స్ తో కలిసి హైదరాబాద్ లోని AMB మాల్ కి వెళ్ళాడు. అక్కడ చరత్ నడుస్తూ వెళ్తున్న వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఈ వీడియోలో చరిత్ అచ్చంగా మేనమామ మహేష్ బాబు నడుస్తున్నట్టే నడుస్తున్నాడు. మహేష్ బాబుకు అందరి హీరోల్లో వాకింగ్ స్టైల్ కానీ, పరిగెత్తడంలో కానీ ఒక సపరేట్ స్టైల్ ఉంటుంది. అది ఇవాళ చరిత్ లో చూడటంతో అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

ఇన్నాళ్లు పోలికలు ఉన్నాయి, మేనరిజమ్స్ ఉన్నాయి అనుకున్నారు. ఇప్పుడు చరిత్ వాకింగ్ స్టైల్ కూడా అచ్చం మహేష్ బాబులా ఉండటంతో ఆశ్చర్యపోతూనే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందంలో కూడా మేనమామకు పోటీగా వస్తున్నాడు ఈ అల్లుడు. మరి భవిష్యత్తులో మహేష్ అల్లుడు చరిత్ ఏ రేంజ్ లో హీరో అవుతాడో చూడాలి. ప్రస్తుతానికి మాత్రం చరిత్ వాకింగ్ స్టైల్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.