Pawan Kalyan – Sreeleela : ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి వర్కింగ్ స్టిల్ షేర్ చేసిన డైరెక్టర్.. పవన్, శ్రీలీలతో హరీష్..
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Director Harish hankar Shares Pawan Kalyan Sreeleela working Still From Ustaad Bhagat Singh Photo goes Viral
Pawan Kalyan – Sreeleela : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో ‘గబ్బర్ సింగ్’ తరువాత ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పవన్ రాజకీయ బిజీ వల్ల పక్కన పెట్టారు. కొంచెం లేట్ అయినా ఈ సినిమా మాత్రం కచ్చితంగా ఉంటుంది. ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కొద్దిగా పూర్తి చేశారు. ఆల్రెడీ ఈ సినిమా నుంచి పోస్టర్స్, గ్లింప్స్ రిలీజ్ చేశారు.
Also Read : Committee Kurrollu : నిహారిక నిర్మాతగా.. కమిటీ కుర్రాళ్ళు టీజర్ వచ్చేసింది.. 90’s కిడ్స్ కోసమే ఈ సినిమా..?
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. నేడు శ్రీలీల పుట్టిన రోజు అవడంతో తను నటిస్తున్న చిత్రాల నుంచి స్పెషల్ గా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో డైరెక్టర్ హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ సమయంలో తీసిన ఓ వర్కింగ్ స్టిల్ ని షేర్ చేసి శ్రీలీలకు శుభాకాంక్షలు తెలిపి, త్వరలోనే మళ్ళీ షూట్ మొదలుపెడదాం అని తెలిపారు.
అయితే ఈ ఫొటోలో.. హరీష్ శంకర్, శ్రీలీల ఉయ్యాల మీద కూర్చొని హరీష్ శ్రీలీలకు సీన్ చెప్తుండగా వెనకాలే పవన్ కళ్యాణ్ కూడా నిల్చొని ఉన్నాడు. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. అటు శ్రీలీల ఫ్యాన్స్, ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే పవన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.