Abhishek Sharma : దక్షిణాఫ్రికాతో మ్యాచ్.. అభిషేక్ శర్మకు ఐడెన్ మార్క్రమ్ ముప్పు..! ఇప్పుడెలా?
టీమ్ఇండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma ) ఫామ్ ప్రస్తుతం టీమ్ఇండియాను టెన్షన్ పెడుతోంది.
T20 World Cup 2026 IND vs SA Abhishek Sharma Could Face Early Aiden Markram Threat
Abhishek Sharma : టీమ్ఇండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ ప్రస్తుతం టీమ్ఇండియాను టెన్షన్ పెడుతోంది. టీ20 ప్రపంచకప్ 2026లో అతడు పరుగుల ఖాతా తెరవలేదు. అతడు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ డకౌట్లు అయ్యాడు. ఇందులో ఓ సారి పేస్ బౌలింగ్‌లో ఔట్ కాగా.. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో స్పిన్నర్ల చేతిలో ఔట్ అయ్యాడు. ముఖ్యంగా ఆఫ్ స్పిన్ బౌలర్లను ఎదుర్కొనడంలో అతడు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్లు కనిపిస్తోంది.
భారత జట్టు సూపర్-8 దశలో తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 22న ఆదివారం దక్షిణాఫ్రికాతో ఆడనుంది. కనీసం ఈ మ్యాచ్ ద్వారానైనా అభిషేక్ శర్మ ఫామ్ అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే.. అతడికి దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ నుంచి ముప్పు ఎదురుకానుంది.
Asia Cup Rising Stars 2026 : ఫైనల్‌కు చేరుకున్న భారత్.. సెమీస్‌లో శ్రీలంక పై ఘన విజయం..
ఆఫ్ బ్రేక్ బౌలర్ అయిన అతడు తొలి ఓవర్‌ను వేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ టోర్నీల్లో పాకిస్థాన్, నమీబియాతో మ్యాచ్‌ల్లో అభిషేక్ శర్మ తొలి ఓవర్లలో ఆఫ్ స్పిన్నర్ల చేతిలో ఔట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మార్క్రమ్ తొలి ఓవర్‌ను వేయొచ్చు.
తొలి బంతికే సిక్స్ వద్దు..
అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ ప్రారంభంలోనే లైన్‌కు అడ్డంగా ఆడకుండా ఉండాలని టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ సూచించాడు. అతడు అద్భుతమైన ఆటగాడు అని, అయితే అంచనాల భారంతోనే అతడు విఫలమవుతున్నాడని చెప్పుకొచ్చాడు. అమెరికాతో మ్యాచ్‌లో మంచి ఇన్నింగ్స్ ఆడి ఉంటే పరిస్థితి మరో రకంగా ఉండేదని, అలా జరగకపోవడంతో అతడు ఇబ్బందులు పడుతున్నాడని అనిపిస్తోందన్నాడు.
IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు సీఎస్కేకు భారీ షాక్.. 14.20 కోట్ల స్టార్ ఆటగాడికి గాయం!
ఇన్నింగ్స్ తొలి బంతికే బౌండరీ కొట్టాలని ప్రయత్నించకూడదని, క్రీజులో కొద్ది సేపు గడపాలన్నాడు. ముందుగా సింగిల్‌తో ఖాతా తెరవాలని, ఆ తరువాత నాలుగు బంతులు పరుగులు చేయకపోయినా పరవాలేదన్నాడు. ఒక్కసారి అతడు కుదురుకుంటే ఆ తరువాత వాటిని అతడు కవర్ చేస్తాడని అన్నాడు.
