Committee Kurrollu : నిహారిక నిర్మాతగా.. కమిటీ కుర్రాళ్ళు టీజర్ వచ్చేసింది.. 90’s కిడ్స్ కోసమే ఈ సినిమా..?

తాజాగా కమిటీ కుర్రాళ్ళు సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేశారు.

Committee Kurrollu : మెగా డాటర్ నిహారిక కొణిదెల(Niharika Konidela) ఇప్పటికే యాంకర్ గా, నటిగా, నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇన్నాళ్లు ఓటీటీ సిరీస్ లు, యూట్యూబ్ లో సిరీస్ లు, షార్ట్ ఫిలిమ్స్ నిర్మించిన నిహారిక తన బ్యానర్ పై ఇప్పుడు సినిమా నిర్మిస్తుంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై నిహారిక, ఫణి నిర్మాతలుగా యదు వంశీ దర్శకత్వంలో ఇటీవల కమిటీ కుర్రాళ్ళు అనే సినిమాని ప్రకటించారు.

Also Read : Raviteja : రవితేజ మెడకు ఏమైంది..? తీవ్రమైన నొప్పితో షూటింగ్.. హరీష్ శంకర్ పోస్ట్ వైరల్..

ఏకంగా 20 మందికి పైగా కొత్తవాళ్లను పరిచయం చేస్తూ ఈ కమిటీ కుర్రాళ్ళు సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, సాంగ్స్ విడుదల చేయగా తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ ని హీరో నితిన్ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. మీరు కూడా టీజర్ చూసేయండి..

కమిటీ కుర్రాళ్ళు సినిమా టీజర్ చూస్తుంటే.. గోదావరి జిలాల్లోని ఓ ఊర్లో ఉండే 90s కిడ్స్ ఫ్రెండ్స్ కథ అని తెలుస్తుంది. టీజర్ లో చిన్నప్పుడు 90s కిడ్స్ చేసే సరదా పనులన్నీ చూపించారు. అయితే చివర్లో ఊళ్ళో గొడవలు జరిగినట్టు చూపించారు. దీంతో ఈ సినిమా స్పెషల్ గా 90s కిడ్స్ కోసమే అని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ టీజర్ వైరల్ అవుతుంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించనున్నారు.

ట్రెండింగ్ వార్తలు