Honeymoon Express : చాన్నాళ్లకు ప్రమోషన్స్ లో కనిపించిన హెబ్బా పటేల్.. హనీమూన్ ఎక్స్‌ప్రెస్ ప్రీ రిలీజ్ ఈవెంట్..

తాజాగా హనీమూన్ ఎక్స్‌ప్రె సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

Honeymoon Express : చైతన్యరావు(Chaitanya Rao), హెబ్బా పటేల్(Hebah Patel) జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’. ఎన్ఆర్ఐ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో KKR, బాలరాజ్ నిర్మాణంలో బాల రాజశేఖరుని దర్శకత్వంలో ఈ హనీమూన్ ఎక్స్‌ప్రెస్ సినిమా తెరకెక్కింది. తనికెళ్ల భరణి, సుహాసిని ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించగా ఈ సినిమా జూన్ 21న గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి పలు పాటలు, టీజర్ రిలీజ్ చేసి మెప్పించగా తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మూవీ యూనిట్ తో పాటు పలువురు అతిధులు కూడా వచ్చారు. అయితే ఇటీవల మీడియా ముందు తక్కువగా కనపడుతున్న హెబ్బా పటేల్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రావడం గమనార్హం.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ దశరథ్ మాట్లాడుతూ.. డైరెక్టర్ బాల రాజశేఖరుని నాకు మంచి మిత్రుడు. ఆయన హాలీవుడ్ లో బ్లైండ్ యాంబిషన్, గ్రీన్ కార్డ్ ఫీవర్ అనే సినిమాలకు పనిచేసి ఇప్పుడు టాలీవుడ్ కి వచ్చి హనీమూన్ ఎక్స్‌ప్రెస్ సినిమా చేసాడు అని తెలిపారు. అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. నేను అమెరికాలో ఉన్నప్పుడు డైరెక్టర్ బాల గారిని మెయిల్ ద్వారా అప్రోచ్ అయ్యాను. ఆయన మూవీకి పనిచేయాలని ఉందని అడిగాను. బాల గారి దగ్గర నేను బ్లైండ్ యాంబిషన్ సినిమాకు పనిచేశాను. నేను ఫస్ట్ పనిచేసింది ఆయన దగ్గరే. ఆయన ఇప్పుడు టాలీవుడ్ కి రావడం ఆనందంగా అందని తెలిపారు.

Also Read : Kannappa Teaser : కన్నప్ప టీజర్ వచ్చేసింది.. శివుడు ఎవరో తెలుసా?

హీరోయిన్ హెబ్బా పటేల్ మాట్లాడుతూ.. హనీమూన్ ఎక్స్‌ప్రెస్ సినిమా ఎగ్జైటింగ్ గా, ఇంట్రెస్టింగ్ చేశాను. ఈ జర్నీ చాలా బాగుంది. జూన్ 21న హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమా వస్తుంది. అందరూ థియేటర్స్ కి వచ్చి చూడాలని తెలిపింది. రైటర్ విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమాలో చైతన్య రావ్, హెబ్బా పటేల్ జంట బాగుంది అని చెప్పి సినిమా టీమ్ కి ఆల్ ది బెస్ట్ తెలిపారు.

డైరెక్టర్ బాల రాజశేఖరుని మాట్లాడుతూ.. నా మొదటి సినిమా కోసం నాగార్జున గారు, అమల గారు, రాఘవేంద్రరావు గారు, ఆర్జీవీ గారు, విజయేంద్రప్రసాద్ గారు..ఇలా చాలా మంది సపోర్ట్ చేశారు. ఇన్నాళ్లు మన దేశానికి దూరంగా ఉండటంతో ఇక్కడి ప్రజలను, కల్చర్ ను మిస్ అయ్యాను. ఇప్పుడు హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమాతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తున్నాను. ప్రసాద్ ల్యాబ్స్ మన తెలుగు సినిమా లెగసీని కొనసాగిస్తుంది. వేలాది సినిమాలు ఇక్కడే తయారవుతాయి. అందుకే మా హనీమూన్ ఎక్స్‌ప్రెస్ సినిమా కూడా ప్రసాద్ ల్యాబ్స్ లో భాగమవ్వాలని ఇక్కడ ఈవెంట్ చేస్తున్నాను. చైతన్య రావ్ కు, హెబ్బా పటేల్ కు డిఫరెంట్ ఇమేజ్ లు ఉన్నాయి. కానీ వారిద్దరి జంట కొత్తగా ఉంటుంది. వంద కోట్ల సినిమా అయినా పది కోట్ల సినిమా అయినా కంటెంట్ బాగుంటేనే ప్రేక్షకులు చూస్తారు. మంచి రొమాంటిక్ కామెడీ మూవీగా హనీమూన్ ఎక్స్ ప్రెస్ అందరికి నచ్చుతుంది అని తెలిపారు.

హీరో చైతన్య రావ్ మాట్లాడుతూ.. ప్రతి నటుడికి అన్ని రకాల ఎమోషన్స్ ఉన్న క్యారెక్టర్ చేయాలని ఉంటుంది. నాకు అది ఈ సినిమాతో తీరింది. దర్శకుడు బాల గారికి హాలీవుడ్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ ఉంది. ఈ సినిమాలో అది కనిపిస్తుంది. లవర్స్, పెళ్లి చేసుకోబోయే వాళ్లు, పెళ్లి చేసుకున్నకొత్త జంట, పెళ్లై ఇరవై ఏళ్లయిన జంటలు.. ఇలా కపుల్స్ అందరికి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది అని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు