Puneeth-Pranitha: ప్రణీత ఉదారత.. పునీత్ నివాళిగా మెడికల్ క్యాంప్!

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మరణానికి దక్షణాది సినీ పరిశ్రమ ఒక్కసారిగా షాక్ కి గురైంది. ముఖ్యంగా కన్నడనాట ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Puneeth-Pranitha: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మరణానికి దక్షణాది సినీ పరిశ్రమ ఒక్కసారిగా షాక్ కి గురైంది. ముఖ్యంగా కన్నడనాట ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. పునీత్ స్టార్ హీరో మాత్రమే కాదు.. ఆయన చేసిన సేవా కార్యక్రమాలు.. ఆయన నడిపించే ఛారిటీ సంస్థల గురించి ప్రపంచానికి తెలియడంతో పాటు సమాజానికి ఆయన లాంటి వ్యక్తులు ఎంత అవసరమో తెలిసొచ్చింది. పునీత్ ఆదర్శంగా కొందరు నటీనటులు కూడా ఆయన అడుగు జాడల్లో నడిచేందుకు సిద్ధమవుతున్నారు.

AHA 2.0: దీపావ‌ళి వెలుగుల‌ను మ‌రింత పెంచ‌నున్న ‘ఐకాన్ స్టార్ ప్రెజెంట్స్ ఆహా 2.0’

ఇప్పటికే తమిళ హీరో విశాల్ పునీత్ చదివించే 1800 పిల్లలను ఒక ఏడాది పాటు చదివించేందుకు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. విశాల్ నిర్ణయానికి దక్షణాది సినీ పరిశ్రమ హర్షం వ్యక్తం చేసింది. కాగా.. ఇప్పుడు హీరోయిన్ ప్రణీత్ సుభాష్ మరో సేవా కార్యక్రమానికి ముందుకొచ్చింది. ప్రజలకు సేవా చేసేందుకు ప్రణీత ఎప్పుడూ ముందే ఉంటుంది. ‘ప్రణీత ఫౌండేషన్‌’ ద్వారా కొవిడ్‌ ఫస్ట్‌వేవ్‌, సెకండ్‌వేవ్‌ సమయంలో ఎంతోమందికి ఎన్నో విధాలుగా సాయం చేసిన ప్రణీత.. ఇప్పుడు మరోసారి తన ఉదారతను చాటుకుంది.

Puneeth Rajkumar Eyes : పునీత్ కళ్లతో నలుగురికి కంటిచూపు

పునీత్‌ రాజ్‌కుమార్‌ గుర్తుగా బెంగళూరు నగరంలో ఒకరోజు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రణీత ప్రకటించింది. ‘అప్పూ సర్‌.. చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ అవసరమైన వారందరికీ సాయం చేశారు. వారి విద్య, వైద్య ఖర్చులను భరించారు. ఇలా ఎన్నో మంచి పనులు చేశారు. అలాంటి గొప్ప వ్యక్తి అడుగుజాడల్లో నడవటమే ఆయనకు మనమిచ్చే అసలైన నివాళి’ అని ప్రణీత ఈ నిర్ణయం తీసుకుంది. నగరంలోని అంబేడ్కర్‌ భవన్‌లో నవంబర్‌ 3న ఈ క్యాంపు ఏర్పాటు చేయనుండగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు ఎవరైనా ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకోవచ్చని ప్రకటించింది.

ట్రెండింగ్ వార్తలు