Prithviraj Sukumaran : తప్పుడు వార్తలు రాసినందుకు… యూట్యూబ్ ఛానల్ పై లీగల్ యాక్షన్ తీసుకోబోతున్న స్టార్ హీరో..

తాజాగా మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ పై ఓ మలయాళం యూట్యూబ్ ఛానల్ అబద్దపు ఆరోపణలు చేసింది. ఇవి ఆ హీరో దాకా వెళ్లడంతో పృథ్వీరాజ్ తన సోషల్ మీడియాలో దీనిపై స్పందించాడు.

Prithviraj Sukumaran : మలయాళం(Malayalam) స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నారు. అయ్యప్పన్ కోషియం, బ్రో డాడీ, లూసిఫర్, జనగణమన, డ్రైవింగ్ లైసెన్స్.. ఇలా వరుసగా హిట్ సినిమాలతో దూసుకుపోతున్నారు. మరోపక్క దర్శకత్వం కూడా చేస్తున్నారు పృథ్వీరాజ్ సుకుమారన్.

ఇక సెలబ్రిటీల మీద రూమర్స్, గాసిప్స్ వస్తాయని తెలిసిందే. చాలామంది ఆ రూమర్స్ ని పట్టించుకోరు. కొంతమంది మాత్రం వాటిని సీరియస్ గా తీసుకొని కౌంటర్ ఇస్తారు. ఇటీవల కొన్ని యూట్యూబ్ ఛానల్స్, మీడియా తమ వ్యూస్ కోసం ఇష్టమొచ్చినట్టు వార్తలు రాస్తున్నారు. కొన్ని సార్లు అబద్ధాలనే ప్రసారం చేస్తున్నారు. ఇలాంటి ఛానల్స్, వార్తలపై ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు సీరియస్ యాక్షన్స్ తీసుకుంటున్నారు. తాజాగా మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ పై ఓ మలయాళం యూట్యూబ్ ఛానల్ అబద్దపు ఆరోపణలు చేసింది. ఇవి ఆ హీరో దాకా వెళ్లడంతో పృథ్వీరాజ్ తన సోషల్ మీడియాలో దీనిపై స్పందించాడు.

Naga Chaitanya : వెంకీ మామయ్యపై నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి.. రానానాయుడు సిరీస్ పై నాగచైతన్య కామెంట్స్..

పృథ్వీరాజ్ సుకుమారన్ తనపై వచ్చిన ఆరోపణల గురించి స్పందిస్తూ.. మరునాడన్ మలయాళీ అనే ఓ యూట్యూబ్ ఛానల్ నా పరువుకు భంగం కలిగించేలా అబద్ధపు ఆరోపణలు చేస్తూ వార్తలను ప్రసారం చేసింది. కొన్ని రకాల సినిమాలు తీస్తున్నాను అని నేను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు 25 కోట్ల ఫైన్ కట్టినట్టు ఆరోపణలు చేస్తూ నాపై వార్తలు రాశారు. ఆ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదు. నాపై ఇలాంటి అసత్య ప్రచారాలు చేసినందుకు ఆ ఛానల్ పై చట్టపరంగా కఠినచర్యలు తీసుకుంటాను. అలాగే అన్ని మీడియా ఛానల్స్ వారికి నా విజ్ఞప్తి.. ఏదైనా సమాచారం వచ్చినప్పుడు అది నిజమా కాదా చెక్ చేసుకొని ప్రసారం చేయండి అని పోస్ట్ చేశారు. దీంతో పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన పోస్ట్ వైరల్ అవ్వగా మలయాళ పరిశ్రమలో సంచలనంగా మారింది.

ట్రెండింగ్ వార్తలు